సహజీవనంతోనే సంతోషంగా ఉందట.. నయన్ పెళ్లి విషయంలో మరో ట్విస్ట్?
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న బ్యూటీ నయనతార. కేవలం కోలీవుడ్ లోనే కాకుండా అప్పుడప్పుడు టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ తన రేంజ్ ని పెంచుకుంటోంది. పర్సనల్ లైఫ్ లో ఎన్ని కాంట్రవర్సీలు చోటు చేసుకున్నా కూడా నయన్ కెరీర్ పై అవి ఎప్పుడు కూడా ప్రభావం చూపలేదు. ఆ విధంగా ఈ బ్యూటీ తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంది.

రూమర్స్ ఎన్ని వస్తున్న కూడా
ప్రస్తుతం కొత్త ప్రేమలో మునిగి తెలుతున్న నయన్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రూమర్స్ ఎన్ని వస్తున్న కూడా నయన్ ఒక్కసారి కూడా వివరణ ఇవ్వలేదు. కనీసం తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా కూడా పెళ్లి పై ఎలాంటి పోస్ట్ చేయలేదు. అయినప్పటికీ కోలీవుడ్ లో రూమర్స్ డోస్ పెరుగుతున్నాయి. యువ దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా ఎక్కడా కూడా పెళ్లిపై స్పందించింది లేదు.

అలాంటి ఆలోచనలో లేదని తెలుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా వీరి పెళ్లికి బ్రేక్ పడిందని వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అయినప్పటికీ ఒక గుడిల్ సింపుల్ గా పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని టాక్ టాక్ వచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం నయనతార అలాంటి ఆలోచనలో లేదని తెలుస్తోంది. మొన్నటివరకు ఆమె ఎలాంటి ప్లాన్ చేసుకుందో తెలియదు గాని ఇప్పుడైతే హీరోయిన్ గానే మళ్ళీ బిజీ అవ్వాలని కొత్త నిర్ణయం తీసుకుందట.

ఆ బాధల నుంచి కొలుకోవడానికి
శింబు, ప్రభుదేవా లాంటి వారితో కొన్నాళ్ళు ప్రేమలో ఉండి ఆ తరువాత ఊహించని విధంగా బ్రేకప్ చెప్పిన నయనతార ఆ బాధల నుంచి కొలుకోవడానికి చాలా సమయం తీసుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసింది. ఇక మొత్తానికి విగ్నేష్ శివన్ ని ప్రేమలోకి దింపి అతనితోనే ప్రేమలో మునిగి తెలుతోంది.
Recommended Video

సహజీవనంతోనే సంతోషం
ప్రస్తుతం నయన్ ని చూస్తుంటే ఆమె సహజీవనంతోనే సంతోషంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. సడన్ గా పెళ్లి చేసుకుంటే మళ్ళీ కెరీర్ పై ప్రభావం పడే అవకాశం ఉందని నయన్ మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఇక మొన్న కుంభకోణంలో ఒక గుడికి వెళ్లి హోమం, ప్రత్యేక పూజలు చేయాలని ఈ జంట నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ అవి ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. నయన్ కూడా చెప్పదని అందరికి తెలుసు. మరి భవిష్యత్తులో అమ్మడు ఎలాంటి నిర్ణయం తీలుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











