డింపుల్ హయాతి- డీసీపీల మధ్య ముదిరిన వివాదం.. తెర మీదకు వేధింపులు..కొత్త కోణం వెలుగులోకి..
హీరోయిన్ డింపుల్ హయాతి- డీసీపీల వివాదం రోజు రోజుకు ముదురుతున్నట్లుగా కనిపిస్తుంది. టాలీవుడ్‌లో ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకరిపై మరొకరు మీడియా ముందుకు వచ్చి మరీ ఆరోపణలు చేసుకుంటున్నారు. పార్కింగ్‌లో ఉన్న తమ కారును ధ్వంసం చేశారని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరోయిన్ డింపుల్ హయాతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో తమ తప్పు లేదని.. కావాలనే డీసీపీ రాహుల్ హెగ్డే తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని డింపుల్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్లు అయింది. తాజాగా హీరోయిన్ డింపుల్ హయాతి తరుఫు లాయర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివారాల్లోకి వెళ్తే..
జర్నలిస్ట్ కాలనీలో నివాసం: హీరోయిన్ డింపుల్ హయాతి జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటోంది. డేవిడ్ అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటుంది. ఇదే అపార్ట్మెంట్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. అయితే కారు పార్కింగ్ విషయంలో డింపుల్ హయాతి ,డీసీపీ రాహుల్ హెగ్డేల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది.

డింపుల్ హయాతిపై కేసు: ఈ క్రమంలోనే ప్రతిరోజు డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారని..అక్కడితో ఆగకుండా తమ వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టారని .. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న డీసీపీ కారు ముందు భాగం డ్యామేజీ అయిందని కారు డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసి టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.డింపుల్ హయాతి, డేవిడ్‌లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు.

డింపుల్ హయాతి రిటర్న్ కంప్లైంట్ : అయితే ఈ కేసులో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేపై డింపుల్ హయాతి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. పార్కింగ్ విషయంలో కావాలనే డీసీపీ గొడవ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది. ట్రాఫిక్ వాహనానికి పార్కింగ్‌లో ప్రవేశం ఎలా ఉంటుందని విషయాన్ని ప్రశ్నించినందుకే డీసీపీ ఇదింతా చేస్తున్నారని ఆమె తరుఫున లాయర్ చెప్పుకొచ్చారు. రాహుల్ హెగ్డే గురించి డింపుల్ హయాతి అపార్ట్మెంట్‌లో ఫిర్యాదు చేయడంతోనే ఆయన ఇలా కక్ష్య తీర్చుకుంటున్నారని డింపుల్ హయాతి తరుపు న్యాయవాది పాల్ సత్య నారాయణ ఆరోపించారు.

తెర మీదకు వేధింపులు: ఇదే సమయంలో న్యాయవాది పాల్ డీసీపీ రాహుల్ హెగ్డేపై సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ కారు కవర్ తీసేసిందని ఎఫ్ఐఆర్‌లో రాశారని, నిజంగా డింపుల్ తొలగించినట్టు ఫుటేజ్ ఉంటే బయటపెట్టండని సవాల్ విసిరారు.తన డ్రైవర్‌ను కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నాడని.. ఇంత జరుగుతున్నా డ్రైవర్ ఎందుకు బయటకు రావడంలేదని డింపుల్ హయాతి తరుపు న్యాయవాది ప్రశ్నించారు. అంతేకాకుండా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారని .. ఇంట్లోకి కూడా ఎవరెవరో వస్తున్నారని, తెలియని నంబర్స్ నుంచి కాల్స్ చేసి ఆమెను భయపెడుతున్నారని న్యాయవాది పాల్ సత్య నారాయణ చెప్పుకొచ్చారు. దీనిపై పోలీసులు ఉన్నత అధికారులు కలుగజేసుకోవాలని ఆయన కోరారు.

డింపుల్ హయాతి కెరీర్: డింపుల్ హయాతి కెరీర్ విషయానికి వస్తే..ఇటీవల హీరో గోపిచంద్‌తో నటించిన 'రామబాణం' సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది.గతంలో రవితేజతో నటించిన 'ఖిలాడీ' కూడా ఫెయిల్ కాయింది. ఇటువంటి తరుణంలో డింపుల్ హయతి ఇలా వివాదాల్లో చిక్కుకోవడం.. ఆమె కెరీర్ మీద ప్రభావం చూపిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ కేసులో తనతో పాటు నిందితుడుగా ఉన్న డేవిడ్ అనే వ్యక్తిని డింపుల్ హయాతి కొద్ది రోజుల్లో వివాహం చేసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో డింపుల్ హయాతినే చెప్పాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











