బుగ్గపై ఓకే అయితే.. లిప్స్‌పై పెట్టుకొంటే తప్పెందుకు.. ‘అంత సీన్ లేదు’ హీరోయిన్ లిప్‌లాక్ రచ్చ

బాలీవుడ్ తారలు నియా శర్మ, రెహానా పండిట్ లిప్‌లాక్ వ్యవహారం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. హోళీ పండుగ సందర్భంగా జరిగిన పార్టీలో నియా, రెహానా కలిసి మీడియాకు బైట్ ఇస్తూ ఒకరికొకరు పెదవులపై గాఢమైన ముద్దు పెట్టుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ఇలా లిప్‌లాక్‌కు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. జమాయ్ రాజా అనే షోలో కూడా ఇలానే ముద్దులతో తెగించారు. అయితే ఈ ముద్దు వివాదంపై వారిద్దరూ ఎలా స్పందించారంటే..

నానా యాగీ ఎందుకు చేస్తారు

నానా యాగీ ఎందుకు చేస్తారు

ముద్దు పెట్టుకొన్నంత మాత్రాన దానిపై నానా యాగీ ఎందుకు చేయడం? ఓ అమ్మాయి బుగ్గపై ముద్దు పెట్టుకున్నప్పుడు తప్పులేనప్పుడు.. పెదవులపై ముద్దు పెట్టుకొంటే తప్పు పట్టడం ఎందుకు? నియా నేను చాలా విభిన్నమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులం. పాజిటివ్ యాటిట్యూడ్‌తో, నేటితర మహిళలుగా ఉంటాం. మేమిద్దరు మంచి స్నేహితులం. మేము కలిసినప్పుడు హ్యాపీగా ఉంటాం అని రెయానా పండిట్ అన్నారు.

 ఇంత రాద్దాంతం అవసరమా?

ఇంత రాద్దాంతం అవసరమా?

నా సోదరి తర్వాత నేను ముద్దు పెట్టుకొనే ఏకైక వ్యక్తి నియా. ఎందుకంటే ఆమెను నా సోదరిగా భావిస్తాను. నేను ఏదో ప్రేమతో ముద్దు పెట్టుకొంటే దానిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇండస్ట్రీలో నాకు ఉన్న ఏకైక స్నేహితురాలు నియా. నాపై ఆమె కురిపించే ప్రేమను మరొకరు ఎవరూ కురిపించరు అని రెయానా అన్నారు.

 లెస్పియన్లము కాము

లెస్పియన్లము కాము

నియా నాపై కురిపించే ప్రేమకు బదులుగా నేను ముద్దు ఇచ్చాను. నా ముద్దు వెనుకు స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. ఇది స్వలింగ సంపర్కానికి సంబంధించిన చేష్టలు కావు. పండుగ రోజున జరుపుకొన్న సంబురాల్లో పెదవులపై ముద్దు పెట్టి ప్రేమను వ్యక్తం చేయడం తప్పు కాదని నా అభిప్రాయం అని రెయానా అన్నారు.

 ముద్దు వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవు

ముద్దు వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవు

రెయానా ముద్దుపై నియా స్పందిస్తూ చిన్న ముద్దును వివాదం చేసి చాలా పెద్దగా చిత్రీకరించారు. దాని వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవు. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకొని ఇంతటితో వదిలివేయాలి. ఏదో ఊహించుకొని చేస్తున్న ట్రోల్‌ను కంట్రోల్ చేసే ఓపిక నాకు లేదు అని అన్నారు.

 రెయానా సోదరి లాంటిదని

రెయానా సోదరి లాంటిదని

రెయానా నాకు కజిన్ లాంటిది. ఐదేళ్లుగా నాకు ఆమె తెలుసు. మా మధ్య బలమైన బంధం ఉంది. హోళీ రోజున నా తల్లికి శుభాకాంక్షలు తెలిపి పెదవులపై ముద్దుపెట్టుకొన్నప్పుడు.. నా స్నేహితురాలి లిప్స్‌పై ముద్దు పెట్టుకొంటే తప్పేముంది. నా ముద్దు వెనుక స్నేహం మాత్రమే ఉంది. దానికి మరోలా కలరింగ్ ఇవ్వకూడదు అని నియా పేర్కొన్నారు.

అంత సీన్ లేదులో రెయానా

అంత సీన్ లేదులో రెయానా

రెయానా పండిట్ కెరీర్ విషయానికి వస్తే తెలుగులో అంత సీన్ లేదు అనే సినిమాలో కనిపించింది. హిందీలో జాక్ పాట్ చిత్రంలో నటించింది. తానాజీ చిత్రంలో ఓ కీలకపాత్రను పోషిస్తున్నది. నియా శర్మ టెలివిజన్ తారగా చాలా పాపులర్. విక్రమ్ భట్ తెరకెక్కిస్తున్న ట్విస్టెడ్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నది. జమాయ్ రాజా టెలివిజన్‌తో విశేష ప్రజాదరణ మూటగట్టుకొన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X