11 ఏళ్ల ఏజ్ గ్యాప్.. ప్రియాంక చోప్రా బర్త్ డే రోజు షాక్ ఇచ్చిన భర్త నిక్!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి సౌత్ ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటికే పలు తెలుగు వెర్షన్ లో విడుదలైన హిందీ చిత్రాలతోనూ దక్షిణాదిన మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభియనంతో కేవలం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా హాలీవుడ్ ఫిల్మ్స్ ల్లోనూ నటించి మెప్పించింది. కొన్నాళ్లు ఇండియన్ ఫిల్మ్స్ కు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. కాగా మిగిలిన సమయం తన భర్త, కొడుకు, ఫ్యామిలీతో గడుపుతోంది. తాజాగా ప్రియాంక చోప్రా తన భర్త గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రియాంకా చోప్రా పుట్టిన రోజు వేడుకలు..
ఇండియాలోనే పుట్టి పెరిగింది ప్రియాంకా చోప్రా. జార్ఘండ్ లోని జమ్షేడ్పూర్ లో 1982 జూలై 18న పుట్టింది. ప్రస్తుతం ఆ పాత్రం బీహార్ లో ఉంది. అశోఖ్, మధు చోప్రాలు ఆమె తల్లిదండ్రులు. వారిద్దరూ తల్లి ఫిజిషియన్ కాగా, తండ్రి ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహించారు. 2013లో చనిపోయారు. ఇక ప్రియాంక చోప్రా తన విద్యాభాస్యం తర్వాత నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ ను అందుకుంది. 2016లో ఆమెకు పద్మశ్రీ అవార్డు దక్కడం విశేషం. ఇక బాలీవుడ్ లో 2002 నుంచి యాక్టివ్ గా ఉంటోంది. అటు హాలీవుడ్ లోనూ భారీ చిత్రాల్లో నటించి మెప్పించింది. గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు పొందింది.

Nick Jonas Celebrated Priyanka Chopra 43 Birthday

11 ఏళ్ల ఏజ్ గ్యాప్..
ప్రియాంకా చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2018 డిసెంబర్ లో రాజస్థాన్ లోని ప్రసిద్ధ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఆ తర్వాత ప్రియాంక, నిక్ జోనాస్ తో కలిసి 2022లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారి మల్టీ మేరి చోప్రా జోనాస్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. అయితే ప్రియాంకా చోప్రా తనకంటే 11 ఏళ్ల చిన్నవాడైనా నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకోవడం విశేషం.

భర్తపై ప్రియాంకా చోప్రా కామెంట్స్..
జూలై 18న ప్రియాంకా చోప్రా పుట్టిన రోజు వేడుకలను భర్త నిక్ జోనాస్ ఘనంగా నిర్వహించాడు. తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ లాంటి ఆహాల్లాదకరమైన వాతావరణంలో వేడుక నిర్వహించి ప్రియాంకా చోప్రాకు షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ప్రియాంకా చోప్రా ఎమోషనల్ అయ్యింది. తన పుట్టిన రోజున కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ తనకు విష్ చేయడం సంతోషంగా ఉందని, అలాగే ఈ యూనివర్స్ తనకు గొప్ప బహుమతిగా తన కుటుంబాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను 43వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మరింత ఆనందంగా ఉందని వివరించింది. ఇక వయస్సుతో సంబంధం లేకుండా తమ ప్రేమను నిరూపించుకుంటున్నారని అభిమానులు, నెటిజనులు సైతం వారిని పొగుడుతున్నారు.

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్..
ప్రియాంకా చోప్రా గతంలో గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన SSMB 29లో నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X