ప్రియాంక చోప్రా ప్రాణాలను కాపాడిన భర్త.. సముద్రంలో పడిపోతుంటే.. ( లైవ్ వీడియో)
పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా దంపతులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అమెరికాలో ఎక్కడ చూసిన ఈ నవదంపతుల సందడే. వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తామిద్దరం ఆదర్శ దంపతులకేమీ తక్కువ కాదనే సంకేతాలను అందిస్తున్నారు. పెళ్లి తర్వా కేన్స్, మెట్ గాలా వేడుకల్లో హల్ చల్ చేశారు.
ఇటీవల తన సోదరుడు జో జోనస్, సోఫీ టర్నర్ పెళ్లి వేడుకలో నిక్ జోనస్, ప్రియాంక భాగమయ్యారు. ఈ సందర్బంగా ఓడపై పార్టీని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో ప్రియాంక చిన్న ప్రమాదం నుంచి బయటపడింది. తాజాగా ప్రమాదం నుంచి ప్రియాంకను నిక్ జోనస్ రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది.

ఇటీవల నిక్ జోనస్, ప్రియాంక చోప్రా తమ కుటుంబంతో కలిసి ఓడలో ప్రయాణిస్తున్నారు. ఆ సందర్బంగా జరుగుతున్న పార్టీలో ఫొటోలకు ఫోజిస్తూ హంగామా చేస్తున్నారు. ముద్దులు, మురిపాలలో జోగుతున్నారు. అంతలోనే నడి సముద్రంలో ఓడ కుదుపు ఇవ్వడంతో నీళ్లలోకి పడిపోయేలా తూళింది. పక్కనే ఉన్న నిక్ జోనస్ తన భార్యను ఒడిసి పట్టుకోవడంతో ప్రియాంకకు ప్రమాదం తప్పింది. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకొన్న ప్రియాంక తన భర్తను గట్టిగా వాటేసుకొన్నది. దాంతో ఆమె ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది.


Click it and Unblock the Notifications











