The Rajasaab: లులు మాల్ ఘటనపై నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. ఇంతకీ ఏమన్నారంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)హీరోగా, దర్శకుడు మారుతి (Maruthi) తెరకెక్కించిన లెటెస్ట్ మూవీ ది రాజా సాబ్ (The Raja Saab). ఆ భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్ (Niddhi Agerwal) ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఓ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో అభిమానులు ఆమెను ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో ఆమె ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఈ ఘటన టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా సెలబ్రిటీ భద్రతపై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై తొలిసారి హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలను అభిమానులు చుట్టుముట్టే ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముంబైలో ఓ సినిమా స్క్రీనింగ్ సమయంలో ధనుష్ తన సహనటిని కాపాడేందుకు స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక హైదరాబాద్‌లో సమంత (Samantha Ruth Prabhu), అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ కూడా అభిమానుల అత్యుహత్సానికి, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు.

అదే విధంగా రాజాసాబ్ మూవీ ఈవెంట్ సందర్భంగా ఓ ప్రముఖ మాల్‌లో నిధి అగర్వాల్ పాల్గొన్నారు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. జనాలు అదుపు తప్పడంతో నిధి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చివరకు అక్కడి నుంచి తప్పించుకుని కారులో కూర్చొన్న తర్వాత ఆమె ఊపిరి పీల్చుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలు చూసినవారికి ఆమె ఎంత ఒత్తిడిని ఎదుర్కొందో స్పష్టంగా అర్థమైంది.
రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సమయంలో లులు మాల్ ఘటనపై స్పందించారు. ఆ సంఘటనపై చాలా జాగ్రత్తగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'ఆ రోజు అక్కడ జరిగింది నిజంగా ఒక దురదృష్టకరమైన సంఘటన. దాని గురించి నేను చాలా మాట్లాడాలి. కానీ, సరైన సమయంలో మాట్లాడతా. ఇది చాలా సున్నితమైన విషయం. పొరపాటున నేను ఏదైనా మాట్లాడితే, అది వేరే దారికి వెళ్లే అవకాశం ఉంది. అందరికీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కచ్చితంగా మాట్లాడతాను... కానీ కాస్త సమయం కావాలి' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. తెలుగు ప్రేక్షకుల గురించి నిధి మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని గుర్తు చేశారు. 'ఈ రెండు రాష్ట్రాల్లో సినిమాలు ఒక సంస్కృతి. స్టార్లను కుటుంబ సభ్యుల్లా ప్రేమిస్తారు. ఆ ప్రేమ చాలా అందమైనది. కానీ ఏదైనా మోతాదు మించితే మంచిది కాదు' అని ఆమె పేర్కొన్నారు.
ఇక నిధి తన కెరీర్ గురించీ మాట్లాడుతూ.. 'ది రాజా సాబ్' విడుదలైన తర్వాత తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల గురించి వెల్లడిస్తానని, తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నానని, ఇతర భాషల్లో కూడా కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేశానని చెప్పారు. 2026 మొత్తం తాను ఫుల్ బిజీగా ఉంటానని స్పష్టం చేశారు. ఓటీటీ ప్రాజెక్టులపై కూడా ఆసక్తి ఉందని, మంచి కథ ఉంటే డైరెక్ట్ ఓటీటీ సినిమాలు చేయడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. అలాగే, 'హరి హర వీరమల్లు' ప్రమోషన్ సమయంలో హీరో పవన్ కళ్యాణ్ తనను ప్రశంసించిన సందర్భం జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పడం విశేషం. మరి భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











