బాత్రూంలో నిధి అగర్వాల్.. అలా దీర్ఘాలోచనలో పడ్డ ఇస్మార్ట్ హీరోయిన్
నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకునేందుకు బాగానే కష్టపడింది. సమ్యసాచి, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలు కలిసి రాకపోయినా ధైర్యంగా నిలబడింది. మరో అవకాశం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసింది. అలాంటి సమయంలోనే పూరి జగన్నాద్ నుంచి పిలుపు వచ్చింది. ఇస్మార్ట్ శంకర్‌లో హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. భారీ హిట్ కొట్టేసింది. దెబ్బకు ఫేట్ మారిపోయింది. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది.

ఇస్మార్ట్ హీరోయిన్..
అలా ఒక్క హిట్ నిధి అగర్వాల్ జీవితాన్ని మార్చేసంది. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నిధి.. ఇస్మార్ట్ సక్సెస్‌తో తనలోని మరో కోణాన్ని ప్రదర్శించింది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు మతిపోగొడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడించి.

సోషల్ మీడియాలో రచ్చ..
నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. హాట్ ఫోటోలతో నెటిజన్లకు గాలం వేయడమే కాకుండా.. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది కూడా. ఆన్ లైన్‌లో ఫ్యాన్స్ వేసే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటుంది. వారిని సంతోషపెడుతుంది.

లాక్డౌన్‌లో సందడి..
లాక్ డౌన్‌లో నిధి ఎక్కువగా ఆన్ లైన్‌లో గడిపింది. నెటిజన్లు ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ సవాల్ విసిరింది. ఇక వారు తమ ప్రతిభను పదును పెడుతూ.. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వాట్సప్ డీపీ ఏంటి? ఫోన్‌లో ఎలాంటి యాప్స్ ఉన్నాయి? వంటి పర్సనల్ విషయాలను అడిగేవారు. అయినా సరే వాటికి నిధి మాత్రం గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పేది.
Recommended Video

బాత్రూంలో రచ్చ..
నిధికి బీచ్‌లు అంటే ఎంతో సరదా అన్న సంగతి తెలిసిందే. తాజాగా నిధి ఓ ఫోటోను షేర్ చేసింది. అప్పుడెప్పుడో మాల్దీవుల్లో సందడి చేసిన నిధి.. అక్కడ దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. బాత్రూంలో బాత్ టబ్‌లో పడుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో నిధి దీర్ఘాలోచనలో పడినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











