చెల్లిని చూసి గర్వపడుతోన్న ఇస్మార్ట్ బ్యూటీ.. నిధి అగర్వాల్ పోస్ట్ వైరల్
ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంది. తెలుగులో అంతగా అవకాశాలేవీ లేకపోయినా ఇప్పుడు దుమ్ములేపుతోంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కనే చాన్స్ కొట్టేసి దూసుకుపోతోంది. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న హరి హర వీర మల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కాకుండా గల్లా అశోక్ హీరోగా రాబోతోన్న చిత్రంలోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది.
ఇక టాలీవుడ్‌లో నిధి జోరు ఇలా ఉంటే.. కోలీవుడ్‌లో మరో లెవెల్‌లో ఉంది. ఈశ్వరన్, భూమి సినిమాలతో నిధి అగర్వాల్ తమిళ పరిశ్రమలోకి అడుగపెట్టింది. అక్కడి అభిమానులు నిధి అందాలకు ఫిదా అయి గుడి కట్టేశారు. అలా కోలీవుడ్‌లో నిధి హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు నిధి అగర్వాల్ తన సోదరిని చూసి తెగ సంబరపడిపోతోంది. న్యూయార్క్‌లోని యూనివర్సీటీలో స్కాలర్ షిప్‌ను సంపాదించుకుందట.

ఆ మధ్య మంచు లక్ష్మీ చేసిన ఓ ఇంటర్వ్యూలో నిధి తన సిస్టర్ తన్వి అగర్వాల్ గురించి చెప్పుకొచ్చింది. తాను సినిమా రంగంలోకి రాదు.. తనకు చదువులంటే ఇష్టం..

మేం కూడా అదే చెప్పామని, బాగా చదవమని ప్రోత్సహిస్తుంటామని చెప్పుకొచ్చింది. అలా ఇప్పుడు న్యూయార్క్‌లోని ఓ యూనివర్సిటీలో స్కాలర్ షిప్ రావడంతో తెగ గర్వపడుతోందట. ఇదే విషయాన్ని చెబుతూ తన ఆనందాన్ని అందరితో పంచుకుంది.


Click it and Unblock the Notifications











