రెండేళ్లుగా తెలుగు హీరోతో అఫైర్.. ఇస్మార్ట్ బ్యూటీ ఏమంటోందంటే..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకోవాలని నేటితరం హాట్ బ్యూటీలు చాలానే కష్టపడుతున్నారు. కొందరు పర్ఫెమెన్స్ తో ఆకట్టుకుంటే మరికొందరు గ్లామర్ తో హీటేక్కిస్తున్నారు. అయితే రెండు రకాలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బ్యూటీలలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవడం లేదు. ఎక్కువగా గ్లామర్ ఫొటోస్ తోనే జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది.

తెలుగు హీరోతో లవ్ అఫైర్
ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ తన లవ్ అఫైర్స్ గురించి వస్తున్న రూమర్స్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. గత కొంత కాలంగా నిధి ఒక తెలుగు హీరో బుట్టలో పడినట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య గత రెండేళ్లుగా ఎఫైర్ ఉందని ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

బాలీవుడ్ లో కూడా అవే..
నిజానికి నిధిపై రూమర్స్ రావడం కొత్తేమి కాదు. ఆమె కెరీర్ మొదటి నుంచి కూడా ఏదో ఒక ప్రేమ కథ వైరల్ అవుతూనే ఉంది. బాలీవుడ్ సెలబ్రెటీలతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే ఈ బ్యూటీ అక్కడ కూడా పలు సందర్భాల్లో లవ్ ఎఫైర్స్ అంటూ న్యూస్ లో ఫోకస్ అయ్యింది. కానీ ఎప్పటికప్పుడు నిధి తనపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇస్తూనే వస్తోంది.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ
అయితే అందులో ఎలాంటి నిజం లేదని ఈ బ్యూటీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తన ఆలోచనలన్నీ కూడా కెరీర్ మీదనే ఉన్నాయని ప్రస్తుతానికి సినిమాలే తన ప్రపంచమని చాలా క్లారిటీ వివరణ ఇచ్చింది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ అనంతరం అమ్మడు పెళ్లికి రెడీ అయ్యిందని వస్తోన్న వార్తలు కూడా అవస్తామని చెప్పిన నిధి ఇప్పట్లో పెళ్లి ఆలోచనలు అసలే లేవని చెప్పేసింది.
Recommended Video

అందులో మెయిన్ హీరోయిన్ గా..
ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం నిధి అగర్వాల్ టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటోంది. అయితే గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు రిపీట్ చేయకుడదని రిస్క్ లేకుండా సినిమాలను ఓకే చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అశోక్ గల్లా మొదటి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే త్రినాధ్ రావ్ నక్కిన , రవితేజ కాంబినేషన్ లో రానున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











