పవన్ కల్యాణ్‌పై నిధి అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్.. సెట్‌లో అలా ఉంటారు అంటూ

అందాల భామ నిధి అగర్వాల్ లాక్‌డౌన్ తర్వాత బిజీగా షూటింగులతో జోరు పెంచారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా మంచి ఆఫర్‌ను దక్కించుకొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగులో పవన్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తన అనుభవాలను పంచుకొంటూ...

పవన్ కల్యాణ్‌కు అభిమానిని

పవన్ కల్యాణ్‌కు అభిమానిని


పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. పవర్ స్టార్‌కు నేనూ పెద్ద అభిమానిని. ఆయన గొప్ప నటుడు. సెట్లో ఉంటే ఆ వైబ్రేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయనతో నటించాలనే కోరిక, కల ఈ సినిమాతో తీరింది అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

జన్మకు సరిపడినంతగా తృప్తి

జన్మకు సరిపడినంతగా తృప్తి

పవన్ కల్యాణ్‌ సినిమాలో భాగం కావడం ఈ జన్మకు ఇక ఇది చాలు అనే ఫీలింగ్ కలుగుతున్నది. సెట్లోకి ఆయన అడుగుపెట్టగానే ఓ అద్భుతమైన సౌరభం చుట్టుపక్కలా వ్యాప్తిస్తుంది. పవన్ కల్యాణ్ సెట్లోకి అడుగపెట్టగానే అందరూ తమ పని చేయడం ఆపేసి.. అన్ని కళ్లు ఆయనపైనే ఉండేలా చేస్తాయి. అదే ఆయన గొప్పతనం అంటూ నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

పవర్‌స్టార్ నుంచి చాలా నేర్చుకొన్నా

పవర్‌స్టార్ నుంచి చాలా నేర్చుకొన్నా

ఇక సెట్లో సీన్లను పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఇంప్రూవ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొద్ది రోజుల్లోనే ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను. తన తోటి నటీనటులకు ఆయన ఇచ్చే మర్యాద, గౌరవం మాటల్లో చెప్పలేం. గొప్ప స్టార్ అయినప్పటికీ.. సీన్లను పలు మార్లు రిహార్సల్ చేస్తూ కనిపిస్తారు. నా కెరీర్‌లో ఓ గొప్ప నటుడిని ఆయనలో చూశాను అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ మూవీలో నా పాత్ర ఏమిటంటే...

పవన్ కల్యాణ్ మూవీలో నా పాత్ర ఏమిటంటే...


హరిహర వీరమల్లు చిత్రంలో నా పాత్ర గురించి వివరాలు చెప్పలేను. ఇది 14వ శతాబ్దంలో జరిగే చారిత్రాత్మక నేపథ్యం గల చిత్రం. నా పాత్ర తీరును బట్టి నేను రాజవైభవం ఉట్టిపడేలా దుస్తులు, అలంకరణతో కనిపిస్తాను. నా పాత్రను తెరపైన చూసుకోవాలనే ఆతృత నాలో రోజు రోజుకు ఎక్కువ అవుతున్నది అంటూ నిధి అగర్వాల్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X