35 సార్లు అలాంటి పరీక్షలు.. ఆ భయంతో వణికిపోయా.. కష్టాలను బయటపెట్టిన నిధి అగర్వాల్
ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి హిట్‌ను సొంతం చేసుకొన్న నిధి అగర్వాల్ ఏకంగా పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకొన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక కావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే హరిహర వీరమల్లుకు సంబంధించిన విషయాలను తాజాగా జాతీయ ఆంగ్లదినపత్రికతో పంచుకొన్నారు. నిధి అగర్వాల్ చెప్పిన విషయాలు మీ కోసం...

అలాంటి వైరాగ్యంతో దిగులుగా
కరోనావైరస్ పరిస్థితుల కారణంగా దాదాపు ఆరు నెలలు ఇంటికే పరిమితమయ్యాను. ఆ సమయంలో షూటింగులు లేకపోవడంతో ఓ రకమైన వైరాగ్యం నన్ను ఆవరించింది. అలా ఆర్నెళ్ల తర్వాత మళ్లీ షూటింగులో అడుగుపెట్టడం ఒక రకమైన భయాన్ని కలిగించింది అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.
మినీ స్కర్ట్‌లో రకుల్ ప్రీత్ అందాల ఆరబోత.. కొంచెం నాటీ.. మరికొంచెం ఘాటుగా

బెంగళూరు, హైదరాబాద్ మధ్య చక్కర్లు
లాక్‌డౌన్ ఎత్తి వేసిన తర్వాత బెంగళూరు, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో కోవిడ్ పరీక్షలు నాకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించాయి. గత ఆరు నెలల్లో సుమారు 35 పరీక్షలు చేయించుకొన్నాను. ఇంకా అసరమైనప్పుడల్లా కోవిడ్ పరీక్షలు చేయించుకొంటూనే ఉన్నాను అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

నాన్ స్టాప్‌గా షూటింగుల్లో
కోవిడ్ పరిస్థితుల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూనే నేను నాలుగు సూట్‌కేసులతో ప్రయాణిస్తూనే ఉన్నాను. గత అక్టోబర్ నుంచి నాన్ స్టాప్‌గా షూటింగులో పాల్గొంటున్నాను. సినిమా పరిశ్రమ మళ్లీ షూటింగులతో కళకళలాడటం హ్యాపీగా ఉంది అని నిధి అగర్వాల్ వెల్లడించారు.

హరిహర వీరమల్లు షూటింగు గురించి
హరిహర వీరమల్లు సినిమా షూటింగు విషయాలను పంచుకొన్నారు. తన మేకప్ విషయం గురించి మాట్లాడుతూ.. సాధారణంగా షూటింగు కోసం తయారు కావడానికి 30 నిమిషాలు పడుతుంది. కానీ ఈ సినిమాకు గంటన్నర పడుతుందని నిధి అగర్వాల్ చెప్పారు.

శరవేగంగా హరిహర వీరమల్లు
చారిత్రాత్మక నేపథ్యంతో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకొంటున్నది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











