విజయ్ సేతుపతి చించేశారు.. ‘ఉప్పెన’పై నిధి అగర్వాల్ ట్వీట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప్పెన సృష్టిస్తోన్న కలెక్షన్ల సునామీ గురించి అందరికీ తెలిసిందే. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. హీరో హీరోయిన్ దర్శకుడు ఇలా అందరూ కొత్త వారే అయినా కూడా ఉప్పెన సాధించిన విజయం, కొల్లగొడుతున్న కలెక్షన్లన చూసి ట్రేడ్ వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. తాజాగా ఈ మూవీపై నిధి అగర్వాల్ స్పందించింది.

ఉప్పెన సినిమా ఇంతలా సక్సెస్ అవ్వడంతో అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఓ సినిమా బాగుందంటే జనాలు ఇంతలా ఆదరిస్తారని, కరోనా అనేది అడ్డంకిగా మారదని ఉప్పెన నిరూపించింది. అందుకే ఈ సినిమాను ఇంకా ప్రమోట్ చేసేందుకు సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న రష్మిక మందాన్న, మహేష్ బాబు వంటి వారు ఉప్పెనపై ట్వీట్లు వేశారు.

Nidhhi Agerwal About Uppena Movie

తాజాగా నిధి అగర్వాల్ ఉప్పెన చిత్రం విజయం సాధించడంపై స్పందించింది. ఉప్పెన టీంకు కంగ్రాట్స్.. సినిమా గురించి ఎంతో గొప్పగా వింటున్నాను.. వైష్ణవ్ తేజ్ క్రితి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.. ఎప్పటిలానే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సర్ చంపేశారు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబుకు దండం పెట్టాల్సిందే.. మైత్రీ మూవీస్ అద్భుతంగా నిర్మించిందంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X