ఆ హీరోతో డేటింగ్ చేయొద్దు.. అఫైర్ పెట్టుకోవద్దు.. నిధి అగర్వాల్‌తో నిర్మాత అగ్రిమెంట్!
ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ అండ్ హాట్ బ్యూటీస్ లో కేవలం కొన్ని సినిమాలతోనే యువత మనసులు కొల్లగొట్టేసిన బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఒకామె అని చెప్పవచ్చు. కాగా తెలుగులో కేవలం కొన్ని సినిమాలే చేసినప్పటికీ తన హాట్ షోతో ఒక్కసారిగా అందరి అటెన్షన్ ని ఆమె అందుకుంది.
కాగా మెయిన్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా ఆమె సెన్సేషన్ గా మారగా ఇపుడు ఫైనల్ గా కొంచెం బిజీగా ఉంది. మరి నిధి అగర్వాల్ ఒక్క తెలుగు సినిమా లోనే కాకుండా సౌత్ లో తమిళ్ సినిమాలు కూడా కొన్ని చేసింది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తాను హిందీ సినిమాలో కూడా నటించడం జరిగింది. అది కూడా ఎప్పుడో 2017లోనే చేసింది.

మరి ఈ సినిమా విషయంలో జరిగిన ఒక క్రేజీ అండ్ షాకింగ్ ఘటనని ఆమె ఇపుడు షేర్ చేసుకోవడం ఆసక్తిగా మారింది. కాగా ఏ సినీ పరిశ్రమలో అయినా నటీనటులు నడుమ డేటింగ్ లు మీటింగులు, గ్రీటింగ్ లు ఇలా చాలానే ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాగే పలు సినిమాలు ముందు నటీనటులకు పలు అగ్రిమెంట్ లు కూడా ఉంటాయని తెలిసిందే.
సినిమా ఓకే అయ్యాక మధ్యలో ఆపడానికి లేకుండా ఇలా చాలానే అంశాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా ఇలానే నిధి అగర్వాల్ కి హిందీలో ఒక ఊహించని అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా తెలిపింది. హిందీలో ఆమె ప్రముఖ హీరో టైగర్ ష్రాఫ్ తో రొమాన్స్ చేయాల్సి ఉంది. కాగా ఈ హీరో విషయంలోనే మేకర్స్ నిధితో ముందే అతనితో ఎలాంటి డేటింగ్ చేయడానికి లేదు అని ఒప్పించి ఆమెతో అగ్రిమెంట్ లో సంతకం పెట్టించుకున్న తర్వాత మాత్రమే ఆమెని సినిమాకి ఓకే చేసుకున్నారట.
ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే నిధి అగర్వాల్ కి ఈ విషయం సంతకం పెట్టే వరకు కూడా తెలియదట. ముందు పెద్దగా ఏమీ చదవకుండానే ఆమె పెట్టేసిందట. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్చయపోయా అని ఈ హాట్ బ్యూటీ చెబుతుంది. అంతే కాకుండా ఈ కండిషన్ పై బహుశా నటీనటులు నడుమ ప్రేమలు లాంటివి లేకుండా ఉంటే బాగా నటిస్తారని బహుశా అలాంటి షరతు తీసుకొని ఉండొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇలా మొత్తానికి నిధి నుంచి ఊహించని స్టేట్మెంట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. కాగా ఇపుడు నిధి అగర్వాల్ తెలుగులో రెండు భారీ సినిమాలు చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు అనే భారీ పాన్ ఇండియా కం పీరియాడిక్ సబ్జెక్టు చేస్తుండగా ఈ సినిమా కాకుండా పాన్ ఇండియా స్టార్ రెబల్ హీరో ప్రభాస్ సరసన ది రాజా సాబ్ సినిమాలో రొమాన్స్ చేస్తుంది. ఇక ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే రానున్నాయి.


Click it and Unblock the Notifications











