ఆ ప్రభుత్వ వాహనం వాళ్లదే.. నాకు వాళ్లే పంపించారు.. నిధి అగర్వాల్ క్లారిటీ
భీమవరం ప్రాంతంలో ఓ జ్యువెల్లరీ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడంతో వివాదంలో సినీ నటి నిధి అగర్వాల్ ఇరుక్కుపోయారు. అనేక ఊహాగానాలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో పోస్టులు పెట్టడంపై ఆమె స్పందించారు. తన విషయంలో తప్పుడు రీతిలో పెట్టిన పోస్టులకు జవాబిస్తూ సాఫ్ట్‌గా మందలించారు. తనకు సపోర్టుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను రిలీజ్ చేశారు. తన లేఖలో నిధి అగర్వాల్ వెల్లడించిన విషయాలు ఏమిటంటే?
భీమవరంలో జరిగిన ఓ స్టోర్ లాంచ్ సందర్భంగా తను ప్రయాణించిన వాహనంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న పోస్టులపై క్లారిటీ ఇవ్వాలనుకొంటున్నాను. అనేక ఊహాగానాలకు ముగింపు పలుకాలని ఈ లేఖ విడుదల చేస్తున్నాను. భీమవరంలో ఈవెంట్‌కు వెళ్లడానికి స్థానిక ఆర్గనైజర్లు నాకు వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ వాహనం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వాహనం కావడం అనేక రూమర్లు, ఊహాగానాలకు తెరలేపింది అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

ప్రభుత్వ వాహనాన్ని నాకు నేనుగా కోరలేదు. దానిని నేను ఎంపిక చేసుకోలేదు అని స్పష్టం చేయాలని అనుకొంటున్నాను. ప్రయాణానికి అనువుగా ఉండేలా ఈ వాహనాన్ని స్థానిక ఆర్గనైజర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ వాహనంలో ప్రయాణించడం వల్ల కొందరికి ఎవో అనుమానాలు వచ్చాయి. కొందరు ఆన్‌లైన్ మాధ్యమాలు, వెబ్‌సైట్లలో తప్పుడు రీతిలో పోస్టులు పెట్టడం నా దృష్టికి వచ్చింది అని నిధి అగర్వాల్ తన లేఖలో వెల్లడించారు.
అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా ప్రభుత్వ అధికారులు నాకు వాహనాన్ని పంపలేదు. మీరు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదు. అందులో నిజం లేదని అలాంటి పోస్టులు పెట్టిన వారికి స్ఫష్టం చేయాలని అనుకొంటున్నాను. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ వార్తలన్నీ నిరాధారం. నా గురించి, ప్రభుత్వ వాహనం గురించి తప్పుడు రీతిలో ప్రచారం చేస్తున్న సమాచారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ప్రయాణించిన వాహనంతో ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని మరోమారు క్లారిటీ ఇస్తున్నాను అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.
నన్ను అభిమానించే వారికి వాస్తవం ఏమిటో తెలుసు. కానీ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సమయంలో నా బాధ్యతగా నేను స్పందించాలని భావించాను. ఈ లేఖ ద్వారా వివరణ ఇవ్వడంలో నా ప్రధాన ఉద్దేశం అదే. నన్ను ప్రేమించే, నన్ను అభిమానించే ఫ్యాన్స్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను అని నిధి అగర్వాల్ తన లేఖలో స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











