రామ్ బర్త్ డే కామన్ డీపీ.. మామా అంటూ హీరోయిన్ కామెంట్
ఇస్మార్ట్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పుట్టిన రోజు (మే 15) సెలెబ్రేషన్స్ రెండ్రోజులు ముందుగానే ప్రారంభమైంది. నేడు రామ్ బర్త్ డే కామన్ డీపీని రిలీజ్ చేశారు. కామన్ డీపీని విడుదల చేసిన క్షణాల్లోనే అది వైరల్ అయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ఓ డైనమిక్ స్టిల్‌ను కామన్ డీపీగా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆడంబరాలకు, సెలెబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని ఇప్పటికే తన ఫ్యాన్స్‌ను కోరాడు రామ్.
ఈ సందర్భంగా రామ్ పోతినేని ఓ ప్రకటన విడుదల చేస్తూ.. 'మీరు నాపై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏటా నా పుట్టిన రోజుని మీరు జరిపే తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో.. అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటాను. ప్రస్తుతం చోటుచేసుకొన్న పరిస్థితుల రీత్యా.. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీరు నా సంతోషం, నా ఎనర్జీ, నా ప్రాణం, అంతకు మించి నా బాధ్యత' అని పేర్కొన్నాడు.

తాజాగా రిలీజ్ చేసిన కామన్ డీపీపై సెలెబ్రిటీస్ అందరూ కామెంట్ చేస్తున్నారు. పీసీ కనెక్ట్స్, పూరీ, ఛార్మీ, శ్రీ విష్ణు, గోపిచంద్ మలినేని, నిధి అగర్వాల్, సురేష్ ప్రొడక్షన్స్, హరీష్ శంకర్ వంటి వారంతా స్పందించారు. ఈ మేరకు నిధి అగర్వాల్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. 'డబుల్ ఎనర్టిటిక్ స్టార్ రామ్ బర్త్ డే కామన్ డీపీ ఇదే. మామా, మార్ ముంతా చోడ్ చింతా.. నీకు అంతా మంచే జరగాలి.. ఇస్మార్ట్ బడ్డీ' అంటూ ట్వీట్ చేసింది.



Click it and Unblock the Notifications











