స్టార్ హీరోయిన్‌కి నిధి అగర్వాల్ చురకలు .. నేను ఆ బ్యాచ్ కాదంటూ మాస్ రిప్లై

ఏ రంగంలో ఉన్న వారికైనా ఒకరిని చూసి మరొకరికి కుళ్లు, అసూయ, ద్వేషం వంటివి కామన్. ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్వలేని పరిస్ధితులు ఉంటాయి. సినీ పరిశ్రమలోనూ ఇది కామన్. ఇక్కడ ఉండే 24 క్రాఫ్ట్స్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ఎంతో మంది చెబుతుంటారు. ఒకరి రహస్యాలను మరొకరు బయటపెట్టుకుంటూ గొడవలు పడుతుంటారు. తాజాగా స్థార్ హీరోయిన్ శ్రీలీల దూకుడుపై ఇన్‌డైరెక్ట్‌గా చురకలంటించారు మరో హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ వివరాల్లోకి వెళితే..

17 ఆగస్ట్ 1992న హైదరాబాద్‌లో స్థిరపడిన మార్వాడీ కుటుంబంలో జన్మించారు నిధి అగర్వాల్. మేనేజ్‌మెంట్ డిగ్రీ పట్టభద్రురాలైన నిధి .. సినిమాలపై ఆసక్తితో 2017లో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్‌తో చిత్ర సీమలో అడుగుపెట్టారు. అనంతం అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచితో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్.. తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో చిత్రాలలో నటించారు.

Nidhhi Agerwal counter to sreeleela harihara veera mallu actress strong reply to netizens

అందం, లుక్స్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ హీరోయిన్‌గా ఆమెకు బ్రేక్ రావడానికి చాలా టైం పట్టింది. అయితే టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఆమె ఎదురుచూపులకు తెరదించారు. ఆయన దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయం సాధించడంతో నిధికి గుర్తింపు దక్కింది. ఇంతలో నిధి అగర్వాల్‌కు కోలీవుడ్‌లోనూ అవకాశాలు క్యూకట్టాయి. ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ తదితర చిత్రాల్లో ఆమె నటించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరిహర వీరమల్లు, ప్రభాస్ హీరోగా వస్తోన్న ది రాజా సాబ్‌లో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఇద్దరు సూపర్‌స్టార్లతో నటిస్తుండటంతో నిధి మంచి జోష్‌లో ఉన్నారు. ఆల్రెడీ 30 క్రాస్ చేసేసిన నిధి ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో శింబు, టీమండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో నిధి రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక శింబు గురించి అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంది. వాళ్లిద్దరూ చెన్నైలో ఒకే ఇంట్లో ఉంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల శింబు తండ్రి టీ.రాజేందర్ తమ కొడుకు ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడని చెప్పడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో లైవ్‌లతో అభిమానులతో ముచ్చటిస్తుంటారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఓ నెటిజన్.. 2019లో ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఏం నిధి అగర్వాల్ ఎన్ని సినిమాలు చేసింది? 2021లో వచ్చిన శ్రీలీల 20కి పైగా సినిమాలు చేసిందని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన నిధి అగర్వాల్ హార్ట్.. నా దగ్గరకు వచ్చిన వాటిలో మంచి స్క్రిప్ట్ అనుకుంటేనే తాను సైన్ చేస్తున్నానని చెప్పింది. ఇందుకోసం అవసరమైతే టైం తీసుకుంటున్నానని.. కొన్నిసార్లు నా నిర్ణయం ఫెయిల్ కావొచ్చు కానీ, మంచి సినిమాలో భాగం కావాలనే నా ఉద్దేశం అని ఈ విషయంలో నాకేం తొందర లేదని ఇన్‌డైరెక్ట్‌గా శ్రీలీల దూకుడుపై చురకలంటించింది నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: nidhhi agerwal sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X