ఆ హీరోయిన్ మీద క్రష్.. నిధి అగర్వాల్ ట్వీట్ వైరల్
అదృష్టమంటే నిధి అగర్వాల్‌దే. మొదటి చిత్రం పూర్తి కాకుండా రెండో ప్రాజెక్ట్ చేజిక్కించుకోవడం ఒకెత్తు అయితే.. అవి రెండూ అంతగా మెప్పించకపోయినా సరే మూడో సినిమా చెంతకు రావడం లక్ కాక మరేమిటి. ఇక మూడో చిత్రం ఇస్మార్ట్ శంకర్‌తో భారీ హిట్ కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇస్మార్ట సక్సెస్‌తో నిధి జాతకమే మారిపోయింది. అందాల ఆరబోతలో ఏ మాత్రం మొహమాటపడకుండా ఉండటంతో నిధి అందాలకు యూత్ ఫిదా అయింది.
ఇస్మార్ట్ సక్సెస్ తరువాత సోషల్ మీడియాలో కాస్త జోరు పెంచింది. హాట్ హాట్ ఫోటోలతో నిధి నానా రచ్చ చేసింది. ఇక లాక్ డౌన్‌లో ఈ చిన్నది చేసిన సందడి అందరికీ తెలిసిందే. హాట్ అండ్ క్యూట్ సెల్ఫీలతో ఫాలోవర్స్‌కు పిచ్చెక్కించేది. ఇంకా ఫోన్‌లో పబ్ జీ, ఇంట్లో వంటలు చేసుకుంటూ, వాటిని రుచిని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది. ఇక నిన్నటి తన బర్త్ డేను ఎంత ఘనంగా సెలెబ్రేట్ చేసుకుందో చెబుతూ వీడియోలను కూడా పోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తరుపున ఎన్ని విషెస్ వచ్చాయో.. సెలెబ్రిటీల నుంచి కూడా అంతే స్థాయిలో బర్త్ డే విషెస్ వచ్చాయి. ఇక వీటిల్ రామ్, పూరి జగన్నాద్ చేసిన ట్వీట్లు ఓ లెక్క అయితే కాజల్ అగర్వాల్ చెప్పిన విషెస్ వాటికి నిధి ఇచ్చిన రిప్లై ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. నిధి మనసులోని మాట బయటకు పెట్టేసినట్టు కనిపిస్తోంది. కాజల్ అగర్వాల్ అంటే తనకు క్రష్ అన్నట్టుగా నిధి ట్వీట్ చేసింది. ప్రస్తుతం కాజల్, నిధి మధ్య ఏముందని నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











