క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న నిధి అగర్వాల్.. మూడ్ రకరకాలుగా ఉందంటూ పోస్ట్
నిధి అగర్వాల్.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఇస్మార్ట్ శంకర్ భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఎంతో మంది దశ తిరిగింది. అందులో హీరోయిన్ అయిన నిధి అగర్వాల్ కూడా ఒకరు. అప్పటి వరకు ఐరన్ లెగ్ అనిపించుకున్న నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్‌లో భాగస్వామి అయింది. దీంతో నిధి ఫేట్ మారిపోయింది. అందాలను ఆరబోయడంతో కుర్రకారుకు మరింత చేరువైంది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చేసే అల్లరికి ఎంతో మంది ఫిదా అయ్యారు.

పరాజయం పాలైనా..
నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్యతో చేసిన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే మొదటి చిత్రం కాకముందే రెండో ఛాన్స్ రావడంతో గట్టెక్కింది. అఖిల్ సరసన మిస్టర్ మజ్ను చిత్రం చేయగా.. అది కూడా బోల్తా కొట్టింది.

పనైపోయిందనుకున్న సమయంలో..
వరుసగా రెండు చిత్రాలు ఫ్లాప్ అవడంతో అంతా ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు. అలాంటి సమయంలో పూరి జగన్నాద్.. ఇస్మార్ట్ శంకర్‌లో చాన్స్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ చిత్రం అనూహ్య విజయాన్నిసాధించడంతో నిధి ఫేట్ మారిపోయింది. దీంతో నిధి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
ఇస్మార్ట్ శంకర్ వల్ల వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ.. సోషల్ మీడియాలో అందాలతో కుర్రకారుకు గాలం వేస్తూ ఉంటోంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అప్పుడప్పుడు నెటిజన్లతో ముచ్చటిస్తుంది కూడా.

భక్తి మూడ్‌లో నిధి..
షిర్డీ సాయిని దర్శించుకున్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ నిధి అగర్వాల్ ఓ పోస్ట్ చేసింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికి ప్రేమ కావాలి ద్వేషం కాదు.. ఎవరికి పనికి రాని కనీసం మీకు కూడా ఉపయోగ పడని ఇంటర్నెట్‌ను వాడి వాడి విసుగొచ్చిన లేదా బోర్ కొట్టి ఉండొచ్చు..మీరంతా ఏం చేస్తున్నారో కాస్త ఆలోచించండ'ని పోస్ట్ చేసింది.
Recommended Video

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేసిన నిధి..
క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఫాలోవర్స్‌ను కట్టిపడేయడం నిధి అగర్వాల్‌కు కొత్తేమీ కాదు. తన మూడ్ వింత వింతగా ఉందని ఎమోజీలను షేర్ చేస్తూ వెరైటీ హావాభావాలతో కూడిన ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











