HariHara VeeraMallu: వీరమల్లును మోస్తున్న నిధి అగర్వాల్‌ .. ఒక్కరోజులో 15 ఇంటర్వ్యూలా!

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐదేళ్ల పాటు ఎదురైన అవాంతరాలను, అడ్డంకులను దాటి వీరమల్లు రిలీజ్‌కు సిద్ధమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్‌ను తెరపై చూడబోతుండటంతో ఆయన అభిమానులు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ నాలుగు రోజుల్లోకి వచ్చేస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. నటీనటులు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉండగా.. జూలై 21న హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

భారీ బడ్జెట్‌తో వీరమల్లు
హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల కన్నుమూసిన మహానటుడు కోట శ్రీనివాసరావుకు ఇదే సినిమా కావడం గమనార్హం. ఆయన కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

Nidhhi Agerwal Dedication for Pawan Kalyan s Hari Hara Veera Mallu She Give 15 interviews in one day

ఐదేళ్లూ వీరమల్లుపైనే
హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కెరీర్‌లోనే తొలిసారిగా పవన్ కళ్యాణ్ వంటి సూపర్‌స్టార్‌తో నటిస్తుండటంతో ఆమె ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒక దశలో వీరమల్లు రిలీజ్ అవుతుందా? లేదా? అన్న ట్రోలింగ్ నడిచినప్పుడు కూడా నిధి అగర్వాల్ ఎంతో ధైర్యంగా ఉన్నారు. విమర్శలకు కౌంటర్లు ఇస్తూ సినిమాకు అండగా నిలిచారు నిధి అగర్వాల్. అసలే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ.. అలాంటిది ఐదేళ్ల విలువైన సమయం ఒక్క సినిమాకే పెట్టడం చాలా రిస్క్. అయినప్పటికీ నిధి దానిని చేశారు.

మాల్ ఓపెనింగ్స్‌‌తో కాలం గడుపుతూ
నిజానికి ఈ సినిమా ఇన్నేళ్లు వాయిదా పడుతుందనే విషయం కనీసం నిధి అగర్వాల్‌కు కూడా తెలియదు. అనివార్య కారణాలతో సినిమా షూటింగ్ వాయిదా పడటంతో పాటు రిలీజ్ కూడా లేట్ అవుతూ వచ్చింది. అయినప్పటికీ మరో సినిమా చేయకుండా పూర్తి సమయం వీరమల్లుకే వెచ్చించారు నిధి అగర్వాల్. ఇందుకు అగ్రిమెంట్ కూడా ఒక కారణం. నిర్మాతలతో ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. వీరమల్లు పూర్తయ్యే వరకు నిధి అగర్వాల్ మరో సినిమా చేయడానికి వీల్లేదు. తనకు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో డబ్బు వచ్చేదని.. దీనితో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ చేయడంతో ఆర్ధికంగా ఇబ్బందులు రాలేదని నిధి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఏకధాటిగా 15 ఇంటర్వ్యూలు
వీరమల్లు సినిమాకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా, మంచి విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇంట్లో ప్రత్యేక పూజలు చేయించింది నిధి అగర్వాల్. ఇకపోతే.. సహజంగా సినిమాల రిలీజ్ సమయంలో హీరో, దర్శకులు ప్రమోషనల్ కార్యక్రమాల బాధ్యతలు తీసుకుంటారు. అలాంటిది వీరమల్లు ప్రమోషన్ కార్యక్రమాల్ని నిధి అగర్వాల్ ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. టీజర్ లాంచ్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతున్న ప్రెస్‌మీట్స్‌లో పాల్గొని మీడియాను ఫేస్ చేస్తోంది. దీనికి తోడు నాన్‌స్టాప్‌గా ఇంటర్వ్యూలు ఇస్తోంది. అది ఎంతలా అంటే ఒక్కరోజులోనే 15కి పైగా ఇంటర్వ్యలూ ఇస్తూ వృత్తిపై తన అంకిత భావాన్ని ప్రదర్శించింది. ఒక్కో ఇంటర్వ్యూకు సగటున 30 నిమిషాలు పట్టినా.. దాదాపు 8 గంటల పాటు కూర్చొని మీడియా ప్రతినిధులు వేసే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పడంతో నిధి అగర్వాల్‌ను సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, అభిమానులు మెచ్చుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X