Don't Miss!
- News
'వెల్లంపల్లి'కి వెచ్చగా.. 'సామినేని' సెగ?
- Sports
INDvsNZ : టీ20ల్లో గిల్ కథేం బాగలేదు.. పెదవి విరిచిన మాజీ దిగ్గజం
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
నిధి అగర్వాల్ ఎద అందాల ఆరబోత: హద్దు దాటేసి మరీ హాట్ షో
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఫిదా చేస్తూ.. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది నిధి అగర్వాల్. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ సినీ ప్రియులను అలరిస్తోన్న ఈ భామ.. అప్పుడప్పుడూ హాట్ షో చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఫలితంగా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నిధి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

హైదరాబాద్ పిల్ల.. అలా ఎంట్రీ
కుర్ర హీరోయిన్ నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలోనే జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా నగరంలోనే సాగింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కర్నాటకకు షిఫ్ట్ అయిపోయింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమా ద్వారా ఈమె హీరోయిన్‌గా ప్రవేశించింది.
Singer Revanth: తండ్రైన సింగర్ రేవంత్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత.. ఇద్దరూ ఎలా ఉన్నారంటే!

తెలుగులోకి రాక.. వరుస షాక్‌లే
హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టిన కొన్నేళ్లకు నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ, ఇది అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయినా.. ఈ బ్యూటీ మాత్రం తన గ్లామర్, యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' అనే సినిమా చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో ఆమెకు షాక్‌లే తగిలాయి.

బిగ్ హిట్‌తో ట్రాక్.. హీరోతో షాక్
వరుసగా పరాజయాలు వస్తున్నా.. నిధి అగర్వాల్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్‌కు మొదటి హిట్ దక్కింది. కానీ, దీని తర్వాత వచ్చిన 'హీరో' మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది.
ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో రకుల్ రచ్చ: మొత్తం తీసేసి చూపించిన వీడియో వైరల్

పవన్ సినిమాలో.. సౌత్‌లోనూ
తెలుగు సినీ ఇండస్ట్రీలో నిధి అగర్వాల్‌కు అవకాశాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో ఆమె కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ వదిలింది. అలాగే, ఓ తమిళం సహా పలు భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో సందడి
సౌతిండియాలోని పలు భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫలితంగా ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరుగుతూనే ఉంది.
Bigg Boss Elimination: 13వ వారం డబుల్ ఎలిమినేషన్.. ఎలిమినేట్ అయ్యే ఇద్దరు ఎవరంటే!

అందాలను ఆరబోస్తూ రచ్చ
సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో నిధి అగర్వాల్ తరచూ వార్తల్లో నిలుస్తుండడంతో పాటు వార్తల్లో హెడ్‌లైన్ అయిపోతోంది.

నిధి హాట్ ఫొటోలు వైరల్‌గా
హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ అందాలను ఆరబోస్తోంది. ఫలితంగా ఆమె ఎద భాగం చూపరులకు కనువిందు చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.