అందాల నిధి .. హద్దులు చెరిపేసి మరీ ఎద అందాల ఆరబోత ..!

బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హైదరాబాద్ బ్యూటీ నిధి అగర్వాల్. 2017లో రిలీజ్‌ అయిన హిందీ సినిమా మున్నా మైఖేల్‌ తో వెండితెరకు పరిచయం అయింది. అయితే నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాఛి అనే సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయ్యింది. అయితే సూపర్ గా ఆడుతుందని అనుకున్న ఆ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్‌ కాలేదు. ఆ తరువాత అఖిల్ కు జోడిగా చేసిన మిస్టర్ మజ్ను మీద కూడా ఆశలు పెట్టుకున్నా అది కూడా ఫ్లాప్‌ అయ్యింది. అయితే మూడో ప్రయత్నంగా చేసిన ఇస్మార్ట్ శంకర్‌ సినిమా మాత్రం ఈ అమ్మడి కెరీర్‌ ను మార్చేసింది. ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో నిధికి ఆఫర్లు క్యూ కట్టాయి.

హాట్ ఫోటో షూట్ పిక్స్ తో రచ్చ

హాట్ ఫోటో షూట్ పిక్స్ తో రచ్చ

ప్రస్తుతం ఈ భామ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ఇప్పుడు ఆమె నటిస్తోంది. అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టడంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ భామ తన లక్ ను పరీక్షించుకోబోతోంది. ఇప్పటికే, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తన హాట్ లుక్స్ తో రొమాంటిక్ ఇమేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సరే ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ పిక్స్ తో రచ్చ రేపుతూ ఉంటుంది.

 కుర్రకారును నిద్ర లేకుండా

కుర్రకారును నిద్ర లేకుండా

నిజానికి ఈ భామ కొద్ది క్రితం వదిలిన ఒక వీడియో సైతం కుర్రకారును నిద్ర లేకుండా చేస్తోంది. దానికి తోడు ఈ భామ మళ్ళీ గ్లామర్ అండ్ స్కిన్ షో రెచ్చిపోయింది. మొన్న చేసిన ఫోటో షూట్ వీడియో కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మళ్ళీ నిధి అగర్వాల్ అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.

తమిళనాడులో ఏకంగా గుడి

తమిళనాడులో ఏకంగా గుడి

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే రోజురోజుకు నిధి అగర్వాల్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ పోతుంది. ఇటీవల తమిళనాడులో కొంతమంది అభిమానులు ఈ గ్లామర్ నిధికి గుడి కూడా కట్టారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తమిళంలో ఆమె శింబుతో ఈశ్వరన్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఒక సాంగ్ కు భీబత్సమైన క్రేజ్ వచ్చింది.

Recommended Video

Hari Hara Veera Mallu షూటింగ్ స్పాట్ లో ప్రమాదం | Pawan Kalyan | Aditya Menon
అన్ని బాషలలో బిజీ బిజీ !

అన్ని బాషలలో బిజీ బిజీ !

త్వరలోనే రిలీజ్ అవుతున్న ఆ సినిమాతో పాటు ఈ భామ ప్రస్తుతానికి గల్లా జయదేవ్​ కుమారుడు అశోక్​ తెరంగేట్రం చేస్తున్న సినిమాలో హీరోయిన్​గా నటిస్తుంది. అలాగే 'జేమ్స్​' అనే కన్నడ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతే కాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X