ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోతో.. ఆ హాట్ బ్యూటీ స్పీడ్ మామూలుగా లేదుగా

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చే ఈ ఫీల్డ్ లో అందం, అభినయమే కాదు.. అదృష్టం ఉండాలి. అలా అన్ని కలిసి వస్తే అవకాశాలు వస్తాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత కష్టమైన అసలు విడిచిపెట్టకూడదు. అలా అయితే.. స్టార్ హీరోయిన్ గా రాణించగలరు. అలా ఓ యంగ్ హీరోయిన్ కు అవకాశాలు కోరి వచ్చాయి. అది కూడా ఇద్దరూ స్టార్ హీరోస్ తో ఇలాంటి బంపర్ ఆఫర్ ను ఎవరైనా విడిచిపెడుతారా? ఆ యంగ్ హీరోయిన్ కూడా ఎంత కష్టమైనా..ఒకే రోజు ఇద్దరూ స్టార్ హీరోస్ షూటింగ్ లో పాల్గొంది. ఇంతకీ ఆ యంగ్ హీరోయిన్ ఎవరో ఓ లూక్కేయండి.

అమ్మడు ఎవరో కాదు. ఇస్మార్ శంకర్ ఫేమ్, యంగ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌(Nidhhi Agerwal). ఆకట్టుకునే అందం, అభిన‌యం ఆమె సొంతం. ఇటీవల యంగ్ హీరోస్ నటించి సక్సెస్ అయినా ఈ బ్యూటీ ఇప్పుడు ఇద్ద‌రు బడా హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పర‌చింది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్ జాతకమే మారిపోయింది. వాస్తవానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో హ‌రిహర వీర‌మ‌ల్లు (Harihara veeramallu)సినిమాలో న‌టించే సమయంలోనే నిధి పూరిలో డైరెక్షన్ లో వర్క్ చేసే అవకాశం కొట్టేసింది. ఈ తరుణంలో మ‌రో గోల్డెన్ ఆపర్చునిటీ అందుకుంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న రాజాసాబ్(Rajasaab)మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది.

Nidhhi Agerwal has shot for both Pawan Kalyan s Hari Hara Veera Mallu and Prabhas The Raja Saab on the same day

అయితే.. ఒకే రోజు ఇద్దరూ బడా హీరోలతో నటించాల్సింది. వాస్తవానికి రెండు బిగ్ బడ్జెట్ మూవీస్ లో నటించడమంటే.. సాధ్యం కాదనే చెప్పాలి. అది కూడా వేరే లోకేషన్స్ ల్లో అంటే.. ఇంపాజిబుల్ అనే చెప్పాలి. కాని, యంగ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ మాత్రం ఆ కఠినమైన టాస్క్‌ను ఎంతో సాఫీగా పూర్తి చేసింది. రెండు సినిమా షూటింగ్ ల్లో పాల్గొంది. షూటింగ్ లోకేషన్స్ ఒకే దగ్గరే కావచ్చు అనుకుంటే..తప్పు.వీరమల్లు ఆంధ్రలో షూటింగ్ ని జరుపుకుంటుంటే.. రాజాసాబ్ తెలంగాణాలో జరుపుకుంటుంది. అంటే.. ఒకే రోజు ఆంధ్ర, తెలంగాణాకి జర్నీ చేస్తూ షూటింగ్ లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరించింది యంగ్ హీరోయిన్ నిధి.

నిజంగా.. హీరోయిన్ నిధి అగర్వాల్ ఒకే రోజు.. విజయవాడలో "హరి హర వీర మల్లుష‌ షూటింగ్‌లో పాల్గొని, ఆ వెంటనే హైదరాబాద్‌కు ప్రయాణించి "ది రాజా సాబ్" షూటింగ్‌కు హాజరు కావాల్సి వచ్చింది. ఇలా ఒకే రోజు రెండు సిటీల మధ్య ట్రావెల్ చేయడం నిధి కి ఛాలెంజ్‌గా మారింది. అలాగే.. ఆమె నటిస్తున్నా ఈ రెండు పాత్రల మధ్య వ్యత్యాసం ఉందంట. ఇలా ఒక్కే రెండు విభిన్న పాత్ర‌ల్లో నటించడం గ్రేట్ అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె డెడికేషన్‌ను మెచ్చుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Nidhhi Agerwal has shot for both Pawan Kalyan s Hari Hara Veera Mallu and Prabhas The Raja Saab on the same day

ఒక్కే రోజు రెండు సినిమాల్లో నటించడం గురించి తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పాన్‌ ఇండియా సినిమాలు.. 'హరిహరవీరమల్లు', 'రాజా సాబ్‌'. ఈ సినిమాల్లో నటిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే.. ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడం త‌న‌కి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది' అంటూ పేర్కొంది. ఇక ఆ సినిమాల షూటింగ్ అప్‌డేట్ కూడా అందించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X