హాట్ వీడియోతో షాకిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ: అందాలను చూపిస్తూ.. వామ్మో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందిగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే హిట్లను అందుకుని సత్తా చాటుతున్నారు. తద్వారా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరు. చాలా రోజుల క్రితమే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ గుర్తింపును దక్కించుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌నూ పెంచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిధి అగర్వాల్ ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై ఓ లుక్కేయండి!

బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన గోవా బ్యూటీ ఇలియానా

మన అమ్మాయే.. కానీ అక్కడ హీరోయిన్‌

మన అమ్మాయే.. కానీ అక్కడ హీరోయిన్‌

నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాద్‌లోనే. మార్వాడి కుటుంబానికి చెందిన ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కర్నాటకకు షిఫ్ట్ అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత నిధి.. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 2017లో ఓ హిందీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

అలా మొదలైన కెరీర్.. వరుస ఫ్లాపులతో

అలా మొదలైన కెరీర్.. వరుస ఫ్లాపులతో

అక్కినేని నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయినా.. ఈ హీరోయిన్ మాత్రం అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' అనే సినిమా చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో ఆమెకు షాకులు తగిలాయి.

ఇస్మార్ట్‌గా హిట్ ట్రాక్ ఎక్కిన అందాల నిధి

ఇస్మార్ట్‌గా హిట్ ట్రాక్ ఎక్కిన అందాల నిధి

వరుస పరాజయాలత సతమతం అవుతోన్న సమయంలో నిధి అగర్వాల్ కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. సరిగ్గా అప్పుడే ఈ అమ్మడు పూరీ జగన్నాథ్ దృష్టిలో పడింది. ఫలితంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా చేసిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్‌కు మొదటి హిట్ వచ్చింది.

మహేశ్ బాబు మేనల్లుడితో.. భారీ పే చెక్

మహేశ్ బాబు మేనల్లుడితో.. భారీ పే చెక్

సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ బ్యాగ్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నాడు. అలాగే, మహేశ్ సోదరి పద్మావతి గల్లా నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ఎంపికైంది. ఈ మూవీ కోసం ఆమె భారీ పే చెక్‌ను అందుకుందని టాక్.

పవన్ కల్యాణ్ సినిమాలో భాగమైన నిధి

పవన్ కల్యాణ్ సినిమాలో భాగమైన నిధి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ పిరియాడిక్ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే, నిధి అగర్వాల్ కూడా కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఆమె ఈ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పుడూ అందులోనే... ఎక్కువగా అవే

నిధి అగర్వాల్ ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో సైతం హల్‌చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకుంటూ ఉంటోంది. అంతేకాదు, ఇక్కడ కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఇలా ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయిపోయింది.

Recommended Video

Hari Hara Veera Mallu షూటింగ్ స్పాట్ లో ప్రమాదం | Pawan Kalyan | Aditya Menon
హాట్ వీడియోతో షాకిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

హాట్ వీడియోతో షాకిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

తాజాగా నిధి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు దిగిన కొన్ని ఫొటోషూట్లకు సంబంధించిన క్లిప్పులను యాడ్ చేసింది. అన్నింట్లోనూ తన అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. కొన్ని డ్రెస్‌లలో ఏ రేంజ్‌లో రెచ్చిపోయిన నిధి.. క్లీవేజ్ షోతో మంట పెట్టేసింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన రీతిలో స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X