పూరీకి ఫ్లాపులుంటేంటి? చైతూ అలాంటోడు.. కానీ అఖిల్ నిప్పు: నిధి అగర్వాల్

బాలీవుడ్ చిత్రం మైఖేల్ మున్నాతో సినీ కెరీర్ ప్రారంభించిన దక్షిణాది ముద్దుగమ్మ నిధి అగర్వాల్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. సవ్యసాచి చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నిధి.. వరుస అక్కినేని హీరో అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. ఈ చిత్రంలో అందంతోనే కాకుండా అభినయంతో కూడా మెప్పించింది. మిస్టర్ మజ్ను విజయం దిశగా ప్రయాణిస్తున్న సమయంలో నిధి తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది. తన సినీ, వ్యక్తిగత విషయాల గురించి ఆమె ఏం చెప్పారంటే..

నిక్కీ పాత్ర ఓ సవాల్ లాంటిది

నిక్కీ పాత్ర ఓ సవాల్ లాంటిది

మిస్టర్ మజ్ను సినిమాకు ముందు నన్ను గ్లామర్ హీరోయిన్‌గానే చూసేవారు. ఇప్పుడు నాలో నటిని చూడటం మొదలుపెట్టారు. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. అందంగా కనిపిస్తూనే అభినయంతో మెప్పించాలనేది నా కోరిక. మిస్టర్ మజ్ను సినిమాలోని నిక్కి పాత్ర నాకు ఓ సవాల్ లాంటిది. ఇంటర్వెల్ సీన్‌లో నా నటన బాగుందని ప్రశంసిస్తున్నారు.

యాక్టర్ అవ్వాలన్నదే కోరిక

యాక్టర్ అవ్వాలన్నదే కోరిక

స్వతహాగా నేను డ్యాన్సర్‌ని. చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలన్నది నా కోరిక. నా అభిరుచిని ప్రోత్సహిస్తూ నా తల్లిదండ్రులు బాలే, కథక్ డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించారు. డ్యాన్స్‌ పరంగా కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్యతో చేసిన సవ్యసాచి మూవీతో నాకు మంచి పేరొచ్చింది. మిస్టర్‌ మజ్నుతో ప్రేక్షకులకు చేరువ కావడం ఆనందంగా ఉంది.

మా అమ్మ కన్నీళ్లు పెట్టుకొంది

మా అమ్మ కన్నీళ్లు పెట్టుకొంది

శ్రీదేవి, అనుష్క, మాధురీ దీక్షిత్‌, దీపికా పదుకొనే నా అభిమాన తారలు. సమంత కూడా ఇష్టమే. వీళ్లంతా గ్లామర్‌తోపాటు అభినయ ప్రధానమైన పాత్రలు చేస్తూ పేరు తెచ్చుకున్నారు. నాకు అమాయకత్వం నిండిన యువతి పాత్రలతోపాటు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలూ చేయాలనుంది. మిస్టర్ మజ్ను చిత్రంలో నా నటన చూసి మా అమ్మ కన్నీళ్లు పెట్టుకొన్నది.

నాగార్జునతో నటించాలని ఉంది

నాగార్జునతో నటించాలని ఉంది

వరుసగా అక్కినేని హీరోలతో చేసే ఛాన్స్ దక్కింది. వ్యక్తిత్వ పరంగా చైతూ నీరు అయితే... అఖిల్‌ నిప్పులా ఉంటాడు. ఒకవేళ నాగార్జునతో కలిసి నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకొంటాను. నాగార్జున గారు చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు. చైతూ, అఖిల్‌కు ఫాదర్ అంటే ఎవరూ నమ్మరు. బ్రదర్ అంటే కచ్చితంగా నమ్ముతారు.

 పూరీకి ఫ్లాపులు ఉంటే ఏమిటి

పూరీకి ఫ్లాపులు ఉంటే ఏమిటి

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నాను. పూరీ సినిమాలు ఆడటం లేదనే విషయాన్ని పట్టించుకోను. ప్రతీ ఒక్కరికి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. నేనేమైనా స్టార్ హీరోయిన్‌నా? ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకొంటున్నాను. పూరీ లాంటి ఫైర్ ఉన్న దర్శకుడితో పనిచేయడం కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఇస్మార్ట్‌ శంకర్‌లో పాత్ర బాగుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X