Mahesh Babu - Trivikram మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ: అందాల విందు చేయనున్న హీరోయిన్!
కొంత కాలంగా అదిరిపోయే ఫామ్‌లో కనిపిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది షూటింగ్ జరుగుతుండగానే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇది ప్రారంభం కాకముందే దీని గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో వార్త వచ్చింది.
మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందించబోయే సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారని.. ఇందుకోసం ఇందులో బాలీవుడ్ భామను హీరోయిన్‌గా తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా నటించబోతుందని తెలిసింది.

మహేశ్ బాబు 28వ చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో ఓ గ్లామరస్ పాత్ర కోసం నిధి అగర్వాల్‌ను తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హీరో వెంటపడే అమ్మాయి పాత్రలో ఆమె నటిస్తుందని తెలుస్తోంది. ఇందులో ఆమె అందాల విందు చేయనుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుందని అప్పుడే ప్రకటించేశారు.


Click it and Unblock the Notifications











