వివాదంలో హరిహర వీరమల్లు హీరోయిన్.. నిధి అగర్వాల్ వాడిన ప్రభుత్వ వాహనం ఎవరిది?

భారతీయ సినిమా పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతున్న నిధి అగర్వాల్ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. భీమవరంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఆమె ప్రభుత్వ వాహనంలో ప్రయాణించి.. అందులో నుంచి దిగుతుండగా మీడియా కంటికి చిక్కారు. ఆమె ప్రయాణించిన వాహనంపై ప్రభుత్వ విధుల కోసం ఉపయోగించబడేదని రాసి ఉండటం ఈ వివాదానికి కారణమైంది. అయితే ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

నిధి అగర్వాల్ విషయానికి వస్తే.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంలో కీలక పాత్రలోనే కాకుండా పవర్‌ఫుల్‌గా కనిపించి మెప్పించారు. ఈ పాత్ర కోసం ఆమె దాదాపు 3 సంవత్సరాలకుపైగా మరే చిత్రంలో కూడా నటించకుండా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. ఇటీవల రిలీజైన ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. క్రిటిక్స్ కూడా ఆమె నటనకు మంచి మార్కులు వేశారు.

Nidhhi Agerwal Landed in Controversy

హరిహర వీరమల్లు చిత్రం తర్వాత ఆమె రెబల్ స్టార్ ప్రభాస్‌‌తో కలిసి ది రాజాసాబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు క్రేజ్ లభించడంతో ఓ ప్రైవేట్ ఈవెంట్ నుంచి ఆహ్వానం రావడంతో దానిలో పాల్గొనేందుకు భీమవరంకు వెళ్లారు. అయితే ఆమె ఉపయోగించిన వాహనంపై ప్రభుత్వ వాహనం ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సాధారణంగా సినీ తారలు వారి సొంత వాహనాల్లోనే వస్తుంటారు. కానీ నిధి వచ్చిన వాహికల్ గవర్నమెంట్ పేరుతో ఉండటంతో రాజకీయంగా విమర్శలకు దారి తీసింది.

భీమవరంలోని జ్యువెల్లరీ షాపు ఓపెనింగ్ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఫ్లయిట్‌లో వెళ్లారు. విజయవాడ నుంచి భీమవరంకు ప్రభుత్వ వాహనంలో వెళ్లారు. అయితే నిధి అగర్వాల్‌కు ప్రభుత్వ వాహనం పంపిదెవరు? ఆ వాహనం ఎవరిది? అధికార దుర్వినియోగానికి పాల్పడ్డది ఎవరు? నిజంగా ఆ వాహనం ప్రభుత్వ అధికారుల కోసం ఉపయోగించేదేనా? అనే ప్రశ్నలు జోరుగా సోషల్ మీడియాలో కనిపించాయి. ఆ వీడియోను పోస్టు చేస్తూ నిధి అగర్వాల్ వాడిన కారు ఎవరిది? ఎందుకోసం వాడారు? ఓ హీరోయిన్‌కు గవర్నమెంట్ వెహికిల్ పంపడం ఏంటి? అనే ప్రశ్నిస్తున్నారు.

అయితే కొందరు ప్రభుత్వ వాహనం.. On Govt Duty అని ఉన్నంత మాత్రాన దానిని ప్రభుత్వ వాహనం అని భావించకూడదు. కొన్నిసార్లు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దెకు పెడుతారు. అలాంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా నిధికి కారు ఇచ్చి ఉంటారేమో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిధి కోసం నిర్వాహకులు ఏర్పాటు చేసిన కారు ఎవరిది? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉండగా, నిధి అగర్వాల్ టీమ్ సోషల్ మీడియాలో స్పందించినట్టు కూడా సోషల్ మీడియాలో ఓ పోస్టు కనిపించింది. On Govt Duty.. AP 39 TA 5303 అనే నంబర్ ప్లేట్ ఉన్న వాహనాన్ని నిధి అగర్వాల్ కోసం ఈవెంట్ ఆర్గనైజర్లు పంపారు. భీమవరంలోని ఏకధి సిల్వర్ జూబ్లీ జ్యువెల్లరీ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఈ వివాదంతో, ఈ కారు ఏర్పాటు చేయడంలో ముఖ్య ప్రభుత్వ నేతకు ఎలాంటి సంబంధం లేదు అంటూ వివరణ ఇచ్చారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో ఆ కారు ఎవరిది? ఎందుకు అనధికారిక కార్యక్రమాలకు ఉపయోగించారనే విషయంపై అధికారులు విచారణ జరిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X