For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nidhhi Agerwal: పొట్టి డ్రెస్ లో వీరమల్లు బ్యూటీ.. టాప్ అందాలతో మైండ్ బ్లాక్!

  |

  చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా గ్లామర్ తో చాలా ఎక్కువగా గుర్తింపు అందుకున్న వారిలో నిధి అగర్వాల్ ఒకరు. చూడగానే తన గ్లామరస్ అందాలతో ఎంతగానో ఆకట్టుకునే ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం మంచి అవకాశాలు అందుకుంటున్న ఈ చిన్నది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలతో కూడా షాక్ ఇస్తోంది. ఇక రీసెంట్ గా మరోసారి ఘాటైన పోజులతో ఫోటోషూట్ నిర్వహించిన ఈ బ్యూటీ మతిపోయేలా చేసింది ఇక ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

  మొదట బాలీవుడ్లో..

  మొదట బాలీవుడ్లో..

  మొదట మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తర్వాత నిధి అగర్వాల్ కు సౌత్ ఇండస్ట్రీలో నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ తొందరపడకుండా ఫ్యాషన్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. ఇక నిధి అలా ట్రై చేసిందో లేదో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైకల్ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించింది.

   అక్కినేని హీరోలతో..

  అక్కినేని హీరోలతో..

  బాలీవుడ్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి మొదటినుంచి కూడా ఆసక్తిని చూపిస్తోంది. ఇక 2018లో నాగచైతన్యతో సవ్యసాచి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ వెంటనే మరో అక్కినేని హీరో అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమాలో పరవాలేదు అనే విధంగా ఈ బ్యూటీ మంచి గుర్తింపును అందుకుంది.

  బిగ్గెస్ట్ హిట్ అదే

  బిగ్గెస్ట్ హిట్ అదే

  ఇక నిధి అగర్వాల్ తన కెరీర్లో మొదటిసారి ఈస్మార్ట్ శంకర్ తో అసలైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ చూసింది. పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కలయికలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను అందుకోవడంతో ఒక్కసారిగా అమ్మడికి ఆఫర్లు క్యు కట్టాయి. కానీ అప్పుడు కూడా ఈ బ్యూటీ తొందరపడలేదు. ఆ తరువాత తమిళంలో రెండు డిఫరెంట్ సినిమాలు చేసింది.

  ఆ రూట్లో మంచి ఆదాయం

  ఆ రూట్లో మంచి ఆదాయం

  ఇక ఈ ఏడాది మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తో కలిసి హీరో అనే సినిమాలో నటించింది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీకి క్రేజ్ ఏమి తగ్గలేదు. ప్రస్తుతం కూడా మంచి సినిమాలలో నటించే అవకాశం అయితే లభిస్తుంది. కేవలం సినిమాలతోనే కాకుండా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ అమ్మడు మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటుంది.

  స్టన్నింగ్ ఫొటోస్ వైరల్

  స్టన్నింగ్ ఫొటోస్ వైరల్

  ఇక రీసెంట్ గా నిధి అగర్వాల్ మెరిసే పొట్టి దుస్తులలో కనిపించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న ఫోటోలు ఇటీవల కాలంలో చాలా తొందరగానే నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక మరోసారి అమ్మడు ఎద అందాలతో అలాగే లెగ్స్ అందాలతో కూడా స్టన్ అయ్యేలా చేసింది.

  పవర్ స్టార్ సినిమాలో..

  పవర్ స్టార్ సినిమాలో..

  నిధి భవిష్యత్తు ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో ఒక రెండు డిఫరెంట్ సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగులో ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు పంచమి. సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా మాత్రమే కాకుండా మంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

  English summary
  Nidhhi Agerwal latest stylish glamorous pics viral in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X