నిధి అగర్వాల్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌లో ఆమెనిలా చూశారంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వారిలో కొంత మందికి మాత్రమే వెంటనే సక్సెస్‌లు దక్కుతున్నాయి. మరికొందరు మాత్రం చాలా ప్రయత్నాల తర్వాత విజయాల బాట పడుతున్నారు. అలాంటి వారిలో లోకల్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరు. చాలా కాలం క్రితమే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సరైన ఆరంభాన్ని దక్కించుకోలేకపోయింది. అయితేనేం చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ గుర్తింపును దక్కించుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌నూ పెంచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిధి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

మన అమ్మాయే.. అక్కడ పరిచయం
నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కర్నాటకకు షిఫ్ట్ అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత నిధి.. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమా ద్వారా ఈ అమ్మడు హీరోయిన్‌గా పరిచయమైంది.

తెలుగులోకి ఎంట్రీ.. వరుస ఫ్లాపులు
నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో నిధి అగర్వాల్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయినా.. ఈ హీరోయిన్ మాత్రం అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' అనే సినిమా చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో ఆమెకు సరైన ఆరంభం దక్కలేదు.

హిట్ ట్రాక్... ఆ వెంటనే మరో షాక్
వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలో నిధి అగర్వాల్ కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. సరిగ్గా అప్పుడే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్‌కు మొదటి హిట్ వచ్చింది. అయితే, దీని తర్వాత వచ్చిన 'హీరో' చిత్ర ఫలితంతో ఆమెకు మరో షాక్ తగిలింది.

పవన్ కల్యాణ్ సినిమా... తమిళ్‌లో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇందులో నిధి అగర్వాల్ కూడా కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక, ఈ చిత్రంతో పాటు నిధి అగర్వాల్ ఓ తమిళ చిత్రంలోనూ భాగమైంది. ఈ షూట్ కూడా ఆమె పూర్తి చేసుకుంది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్
ఒక పక్క వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోవైపు నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో సైతం హల్‌చల్ చేస్తోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ఉంటోంది. ఫలితంగా ఈ అమ్మడు తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

అందాల విందు చేస్తోన్న బ్యూటీ
సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ మరింత ఎక్కువగా ఇస్తోంది. ఇందులో భాగంగానే అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. అదే సమయంలో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

స్లీవ్‌లెస్ టాప్‌లో నిధి హాట్ ట్రీట్
హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌ను ధరించి మరీ అందాల విందు చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











