ఆ స్టార్ హీరోతో త్వరలోనే నిధి అగర్వాల్ పెళ్లి.. సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ?
గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నిధి అగర్వాల్ పేరు ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఈ బ్యూటీ ఎలాంటి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన కూడా ఈజీగా వైరల్ అవుతోంది. అయితే సినిమాలకు సంబంధించిన వార్తల కంటే కూడా కూడా నిధి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో హాట్ టాపిక్ గా మారుతోంది. గత ఏడాది వరకు సినిమాలు తప్పితే మరోక విషయంలో ఈ బ్యూటీ పేరు ఎక్కువగా వినిపించలేదు. ఇక ఇప్పుడు మాత్రం పెళ్లికి సంబంధించిన రూమర్స్ చాలా ఎక్కువగానే వస్తున్నాయి.

మోడలింగ్ నుంచి బాలీవుడ్
హైదరాబాద్ లో జన్మించిన నిధి అగర్వాల్ ఆ తరువాత బెంగుళూరుకు వెళ్లి సెటిల్ అయ్యింది. హైదరాబాద్ లో పుట్టిన ఈ మార్వాడి అమ్మాయి చిన్న తనంలోనే ఎక్కువగా నటన వైపు యూ టర్న్ తీసుకుంది. బెంగుళూరు వెళ్లిన అనంతరం మోడలింగ్ వైపు కూడా మనసు మళ్లింది. అటు నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకు కూడా యూ టర్న్ తీసుకుంది.

వరుస అవకాశాలు
నిధి అగర్వాల్ మొదట బాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మున్నా మైకేల్ అనే సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది కానీ ఆఫర్స్ అయితే ఎక్కువగా రాలేదు. నిధి అగర్వాల్ ఆ తరువాత సవ్యసాచి, మిస్టర్ మజ్ను అంటూ వరుసగా అక్కినేని యువ హీరోలతో రొమాన్స్ చేసింది. ఆ సినిమాలు కూడా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు.

ఆ సినిమాతో బిగ్ హిట్
ఇక 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూరి జగన్నాథ్ , రామ్ కలయికలో వచ్చిన ఆ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి కి డబుల్ ప్రాఫిట్స్ ను అందించింది. ఇక ఇస్మార్ట్ శంకర్ అనంతరం ఈ బ్యూటీకి వరుసగా అవకాశాల సంఖ్య పెరిగింది. కానీ వీలైనంత వరకు జాగ్రత్తగా మంచి ప్రాజెక్ట్ లను సెలెక్ట్ చేసుకుంటోంది.

హీరోతో ప్రేమ
అయితే ఇటీవల కాలంలో నిధి అగర్వాల్ ప్రేమ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిధి అగర్వాల్ పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉందని తమిళ హీరో శింబూతో ఆమె ప్రేమలో ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈశ్వరన్ సినిమాలో నటించిన అనంతరం ఆ జంట చాలా క్లోజ్ అయినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

త్వరలోనే పెళ్లి?
ఇక సమ్మర్ లోనే వారు పెళ్లి చేసుకునేందుకు సీక్రెట్ గా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కూడా కథనాలు వస్తున్నాయి. మార్చి అనంతరం ఇద్దరు కూడా వారి దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవసిగా పెళ్లికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సోషల్ మీడియాలో కూడా టాక్ కొనసాగుతోంది. ఇక ఇప్పటివరకు ఈ విషయంలో ఈ ఇద్దరు స్టార్స్ రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ విషయంలో ఎవరు ముందుగా క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తమిళంలో కూడా మరొక సినిమా చేయనుందట.


Click it and Unblock the Notifications











