For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో నిధి.. సహజీవనం కూడా.. పవన్ సినిమా పూర్తవగానే ఏడడుగులు

  |

  అందాలు ఆరబోస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నిధి అగర్వాల్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. అందాల ఆరబోతలో పీజీ చేసిందా అనే విధంగా ఈ బ్యూటీ ఎలాంటి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసినా కూడా అది చాలా త్వరగా వైరల్ అవుతోంది. అయితే సినిమాలకు సంబంధించిన వార్తల కంటే కూడా కూడా నిధి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమె పెళ్లి వ్యవహారం మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  బాలీవుడ్ సినిమాతో

  బాలీవుడ్ సినిమాతో

  హైదరాబాద్ లో అగర్వాల్స్ కుటుంబంలో పుట్టిపెరిగిన నిధి అగర్వాల్ ఆ తర్వాత చదువు కోసం బెంగుళూరుకు వెళ్లి సెటిల్ అయ్యింది. బెంగళూరు వెళ్లిన అనంతరం మోడలింగ్ వైపు ఆమె మనసు మళ్లడంతో సినిమాల్లో నటించే విషయం మీద దృష్టి పెట్టింది. నిధి అగర్వాల్ మొదట బాలీవుడ్ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

  అనేక సినిమాలు

  అనేక సినిమాలు

  మున్నా మైకేల్ అనే సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది కానీ ఆఫర్స్ అయితే ఎక్కువగా రాలేదు. తెలుగులో చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పటికీ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలు ఈ భామ చేసింది కానీ ఒక్క సినిమా కూడా మంచి పేరు అయితే తెచ్చిపెట్టలేదు.

  పెళ్లి వార్తలు

  పెళ్లి వార్తలు

  ప్రస్తుతానికి ఈ భామ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కించుకుని జాక్ పాట్ కొట్టింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె దశ మారుతుందని అనుకున్నారు కానీ ఆమె అంత ఈజీగా అయితే అన్ని సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఇటీవల కాలంలో నిధి అగర్వాల్ ప్రేమ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

  ఫుల్ బిజీగా

  ఫుల్ బిజీగా

  నిధి అగర్వాల్ పెళ్లి చేసుకోవడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. ఆ మధ్య తమిళ హీరో శింబూతో ఆమె ప్రేమలో ఉన్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. ఈశ్వరన్ సినిమాలో నటించిన అనంతరం వీరిద్దరూ క్లోజ్ అయినట్టు కోలీవుడ్ లో పేద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సంవత్సరం వీరి వివాహం భారీ ఎత్తున జరిగే అవకాశం ఉందని అంటున్నారు. శింబు వెందు తానింధతు కాదు షూటింగ్‌లో బిజీగా ఉండగా, నిధి పవన్ కళ్యాణ్‌తో హరి హర వీర మల్లు షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది.

  Recommended Video

  Nidhi Agarwal Bravest Replies To Actor Naresh Tricky Questions | Hero Movie | Filmibeat Telugu
  అప్పుడే పెళ్లి

  అప్పుడే పెళ్లి

  ఆ సినిమా షూట్ పూర్తయిన తరువాత వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. నిధి ఇప్పటికే టి నగర్‌లోని శింబు ఇంటికి మకాం మార్చినట్టు తెలుస్తోంది. ఈ జంట చాలా నెలలుగా సహజీవనం చేస్తున్నారని అంటున్నారు. ఏప్రిల్ దాటాక కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లికి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఇప్పటివరకు ఈ విషయంలో ఈ ఇద్దరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ మధ్య హీరో సినిమా ప్రమోషన్స్ లో అదేమీ లేదన్నట్టు నిధి క్లారిటీ ఇచ్చింది.

  English summary
  Nidhhi Agerwal Marriage with simbu after finishing hari hara veera mallu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X