హీరోయిన్‌గా మెయింటెనెన్స్ కష్టం... నిధి అగర్వాల్ ఎమోషనల్

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ. వరుసగా హిట్స్ పడి, మంచి సక్సెస్ రేట్ ఉంటే ఓ ఐదారేళ్లు ఇండస్ట్రీలో కొనసాగవచ్చు. అదే ఎలాంటి హిట్స్ లేకుంటే మాత్రం కెరీర్ గల్లంతే. అయితే ఈ గ్యాప్‌లో హీరోయిన్‌గా మెయింటైన్ చేయడం మాత్రం అంత ఆషామాషీ కాదు. హీరోయిన్ల కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు నిధి అగర్వాల్. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, కొత్త సినిమాలు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

2017లో మున్నా మైకేల్ అనే హిందీ మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు నిధి అగర్వాల్. ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో తెలుగువారిని పలకరించారు. అనంతరం మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో తదితర చిత్రాలలో నటించారు. టాలీవుడ్‌లో సక్సెస్ కాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకోవాలని అనుకున్నారు. ఈశ్వర్, భూమి, కలగ తలైవన్ సినిమాలు చేశారు. ఇదే సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో నిధి ప్రేమాయణం సాగించినట్లుగా వార్తలు వచ్చాయి. తమిళంలోనూ తనకు ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో తెలుగులో మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నించింది.

Nidhhi Agerwal Opens Up on Her Career Struggles and High Maintenance Costs of Heroines

ఈ దశలో పవర్‌స్టార్ కళ్యాణ్ సరసన హరిహరి వీరమల్లు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ది రాజాసాబ్ మూవీలలో ఆఫర్లు రావడంతో తన కెరీర్ గాడిలో పడుతుందని భావించింది. అలాగే దాదాపు ఐదేళ్ల సమయం ఈ రెండు సినిమాలకే కేటాయించింది. సినిమాల ప్రమోషన్స్‌లోనూ శక్తివంచన లేకుండా కష్టపడింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారడంతో తన సమయాన్ని కోల్పోయింది. అంతేకాదు వీరమల్లు ప్రమోషనల్ కార్యక్రమాలను సైతం నిధి అగర్వాలే మోశారు. వరుసపెట్టి ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు, ఇతర ఈవెంట్స్‌లో పాల్గొన్నారు.

అయితే వీరమల్లు, రాజాసాబ్‌లు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో నిధి ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, సోషల్ మీడియాతోనే కాలం గడుపుతోంది. అయితే కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని నిధి అగర్వాల్ గతంలోనే చెప్పారు.

కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ల మెయింటెనెన్స్‌కు నెలకు ఖర్చులు ఎంత అని యాంకర్ అడగ్గా.. నిధి ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. నటిగా కొనసాగాలంటే టాలెంట్‌తో పాటు భారీగా మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భరించాలని నిధి పేర్కొన్నారు. హీరోయిన్లకు నెలకు లక్షల్లో ఖర్చులు ఉంటాయి. జిమ్, యోగా, ఫిట్‌నెస్ ట్రైనింగ్‌తోపాటు స్కిన్ కేర్, మేకప్, హెయిర్ స్టైలింగ్‌లకు భారీగా ఖర్చు పెట్టాలి. దీనికి తోడు ప్రయాణాలు, వసతి, అసిస్టెంట్స్, ఇతర వ్యక్తిగత సిబ్బందికి జీతభత్యాల కోసం నెలకు లక్షల్లో ఉంటుందని నిధి తెలిపారు.

సినిమా షూటింగ్స్‌లో పాల్గొనే సమయంలో నిర్మాత కొన్ని భత్యాలు భరించినప్పటికీ.. సెలబ్రిటి స్టేటస్‌ను కాపాడుకోవడానికి ఖర్చు పెట్టాల్సిందే. ఇక స్టార్‌డమ్ పెరిగేకొద్ది హీరోయిన్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సొంతంగా విమానాలు, విలాసవంతమైన జీవితం కోసం కోట్లలో ఖర్చు చేయాల్సిందేనని నిధి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారగా.. హీరోయిన్ల జీవితాలు ఇలా ఉంటాయా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X