హరిహర వీరమల్లుపై దుష్ప్రచారం.. వాళ్ల తీరు అంతే.. నిధి అగర్వాల్ ఆగ్రహం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నిధి అగర్వాల్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న కథలో మెరిసింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడమే కాకుండా తన నటనతో మెప్పించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని వర్గాలు ఈ మూవీని ట్రోల్ చేయడం, ఈ చిత్రానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడంపై ఆమె తాజాగా స్పందించారు. ఆమె ఏలా స్పందించారంటే?

నిధి అగర్వాల్ తన మూడేళ్ల సమయాన్ని హరిహర వీరమల్లు సినిమా కోసం త్యాగం చేశారు. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత మూడు కరోనా లాక్ డౌన్స్ రావడం, అలాగే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా కోసం మరే సినిమాను ఒప్పుకొకుండా వెయిట్ చేసింది. పలు ఆఫర్లను వదులుకొని ఈ సినిమాను కంప్లీట్ చేసింది. అలాగే నిర్మాత అనుమతితో ది రాజాసాబ్ చిత్రంలో నటించింది.

Nidhhi Agerwal reacted on Social Media Trolls

ఇక హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్‌ను నిధి అగర్వాల్ తన భుజాలపై మోసింది. పవన్ కల్యాణ్ ప్రభుత్వ పనుల్లో మంత్రిగా బిజీగా ఉండటంతో ఆమె స్వయంగా ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు కంటిన్యూగా పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ విషయం గురించి చెబుతూ నిధి అగర్వాలపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాము ఇంతగా కష్టపడితే కొందరు ట్రోల్స్ చేసి ఈ సినిమా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరిహర వీరమల్లు సినిమాపై జరిగిన ట్రోలింగ్, నెగిటివిటీ గురించి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఏ సినిమా వచ్చినా ప్రతీ ఒక్కరు నెగిటివిటి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వర్క్ కావాలంటే నెగిటివ్‌గా కామెంట్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెడితేనే చూస్తారు. పాజిటివ్ పోస్టులు పెడితే ఎవరూ చూడరు. అందుకే హరిహర వీరమల్లు సినిమానే కాకుండా ఇతర సినిమాలు కూడా ఈ ప్రతికూలతను ఫేస్ చేస్తున్నాయి. దానిని పెద్దగా పట్టించుకోవద్దు అని నిధి అగర్వాల్ అన్నారు.

అయితే సోషల్ మీడియాలో నెగిటివిటిని తప్పిస్తే.. హరిహర వీరమల్లు సినిమాపై ప్రేక్షకులు అమితంగా ప్రేమను కురిపించారు. సోషల్ మీడియాలో ఓ ఎజెండా, ఓ దురుద్దేశంతో చేసిన ప్రచారాన్ని ఈ సినిమా బలంగా తిప్పికొట్టింది. అన్ని సమయాల్లో దుష్ప్రచారం వర్క్ కాదని మా సినిమా నిరూపించింది అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

నిధి అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. హరిహర వీరమల్లు సినిమా తర్వాత ప్రభాస్‌తో కలిసి ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా డిసెంబర్ 5 రిలీజ్ అవుతుందని నిర్మాత ప్రకటించారు. కానీ ఈ మూవీని సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా రేంజ్, స్కేల్ బిగ్ లెవెల్‌లో ఉండటం వల్ల ఫ్యాన్స్ అంతా సంక్రాంతికి రిలీజ్ చేయాలని కోరుతున్నారు అని నిర్మాత విశ్వ ప్రసాద్ తెలిపారు. దాంతో ఈ నిధి మరోసారి సంక్రాంతికి దర్శనమిచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X