ఆ వీడియోలకు బానిసగా స్టార్ హీరోయిన్.. డైలీ నైట్ ఆ పని జరగాల్సిందే!
ప్రతి ఒక్కరికి కొన్ని వింత అలవాట్లు ఉంటాయి. తిండి, నిద్ర, ఇతర అలవాట్లు భిన్నంగా ఉంటాయి. వీటికి స్టార్స్ కూడా అతీతం కాదు.. తాజాగా ఓ హీరోయిన్ తనకున్న అలవాటును సోషల్ మీడియా ద్వారా బయటపెట్టి షాకిచ్చింది. డైలీ రాత్రి పూట తాను చేసే ఓ పనిని అభిమానులతో పంచుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకున్న అలవాటు ఏంటీ? ఈ వివరాల్లోకి వెళితే..
స్టార్‌డమ్ కోసం యుద్ధం
అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ నెంబర్ రేసులో వెనుకబడిపోయారు నిధి అగర్వాల్. 2017లో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్‌తో చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచితో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది నిధి అగర్వాల్. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆమె బ్రేక్ అందుకున్నారు. టాలీవుడ్‌లో వచ్చిన ఫేమ్‌తో తమిళ చిత్ర పరిశ్రమలోనూ అవకాశాలు అందుకున్నారు నిధి. ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

పవన్, ప్రభాస్ సరసన ఛాన్స్
పడుతూ లేస్తూ సాగుతున్న నిధి అగర్వాల్ కెరీర్‌కు మంచి బూస్టప్ ఇచ్చింది హరిహర వీరమల్లు చిత్రం. ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుంది ఈ మార్వాడీ ముద్దుగుమ్మ. ఇదే ఊపులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ది రాజా సాబ్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు నిధి. అందరూ హీరోయిన్ల మాదిరిగానే ఈమె వ్యక్తిగత జీవితంపైనా పలు రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా కోలీవుడ్ హీరో శింబుతో నిధి ప్రేమలో పడ్డారని.. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ గాసిప్స్ తాకిడి రోజు రోజుకు పెరిగిపోవడంతో శింబుతో రిలేషన్‌లో ఉన్నట్లుగా వస్తున్న కథనాలు నిరాధారమని స్పష్టం చేశారు నిధి.
వీరమల్లు ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీ
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు దగ్గరపడటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు నిధి అగర్వాల్. జూలై 24న పవన్ కళ్యాణ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఆమె చాలా ఎగ్జయిటింగ్‌తో ఉంది. ప్రెస్‌మీట్‌లు, ఇతర ఈవెంట్‌లలో పాల్గొనడంతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా నిధి అగర్వాల్ ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. అటు రాజా సాబ్ టీజర్ విడుదలై దానికి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తన కెరీర్‌కు ఈ సినిమాలు ప్లస్‌గా మారతాయని భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ ఏడాది డిసెంబర్ 5న ది రాజా సాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాల్లో నిధి అగర్వాల్ నటన బాగుండి .. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఆమె టాలీవుడ్‌లో బిజీ అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాత్రుళ్లు నిధికి ఆ అలవాటు
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిధి అగర్వాల్.. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఛాట్‌లు నిర్వహిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. తాజాగా అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిధి అగర్వాల్.. తనకు ప్రతిరోజూ రాత్రి మర్డర్ మిస్టరీ జోనర్‌లో తెరకెక్కిన సినిమాలు, కంటెంట్ చూడటం తనకు అలవాటని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మర్డర్ మిస్టరీలు చూసేయడంతో కంటెంట్ దొరకడం లేదని, వెతకడం కష్టంగా ఉందని నిధి తెలిపారు.
సాయం చేయమంటూ పోస్ట్
అంతేకాదు.. తనకు కొత్త కంటెంట్ దొరకడం లేదని, తనకు సాయం చేయాలని మర్డర్ మిస్టరీలు ఉంటే సజెస్ట్ చేయమని నిధి అగర్వాల్ ట్వీట్ చేశారు. ఏ భాష అయినా పర్లేదు కంటెంట్ ఉంటే పంపాలని కోరారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా.. నెటిజన్లు మాస్ రిప్లయ్ ఇస్తున్నారు. మేఘాలయ హనీమూన్ కేసు, తేజేస్వర్ మర్డర్ కేసుల గురించి తెలుసుకోవాలని.. ఇవి అసలు సిసలు మర్డర్ మిస్టరీలని అంటున్నారు. మరి మీ దగ్గర ఏమైనా ఉంటే మర్డర్ మిస్టరీలు ఉంటే నిధి అగర్వాల్‌కు పంపండి.


Click it and Unblock the Notifications











