హాట్ ఫొటో షేర్ చేసిన నిధి.. మీ వల్లే రేప్‌లు జరుగుతున్నాయంటూ నెటిజన్ ఫైర్
నిధి అగర్వాల్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నటి. అక్కినేని నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అదే కాంపౌండ్ హీరో అఖిల్‌తో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినప్పటికీ ఈ సినిమాల్లో నిధి నటన, గ్లామర్‌తో పూరీ జగన్నాథ్ కంట్లో పడింది. దీంతో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ద్వారా ఆమెకు మొదటి హిట్ వచ్చింది. ఈ సినిమా తర్వాత పలు ఆఫర్లు దక్కించుకుంటున్న నిధికి తాజాగా సోషల్ మీడియాలో ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో ఆమె హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే..

నిధి అక్కడ ఫుల్ బిజీ
నిధి అగర్వాల్ ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో సైతం హల్‌చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకుంటూ ఉంటోంది. అంతేకాదు, ఇక్కడ కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది.
హాట్ ఫొటో షేర్ చేసిన నిధి
తాజాగా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె రిలాక్స్ అని పేరున్న టాప్ ధరించింది. ఈ ఫొటోలో ఆమె హాట్‌గా కనిపిస్తోంది. దీంతో ఈ ఫొటోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
నెటిజన్ నుంచి ఊహించని కామెంట్
నిధి అగర్వాల్ షేర్ చేసిన ఫొటోపై స్పందిస్తూ ఓ నెటిజన్ ‘మీ లాంటి వాళ్ల వల్లే మన దేశంలో అమ్మాయిలు రేప్‌లకు గురవుతున్నారు. మీరు హాట్ ఫొటోలు షేర్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సినిమాకే పరిమితం చేసుకోండి' అని కామెంట్ పెట్టాడు. అనంతరం దీనిని డిలీట్ చేసేశాడు.

అదిరిపోయే రిప్లై
నెటిజన్ చేసిన కామెంట్‌పై నిధి అగర్వాల్ హుందాగా స్పందించింది. ‘చూశారా.. ఈ వ్యక్తి ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయో. దయ చేసి మీ అడ్రెస్ నాకు పంపించు. నీకు ‘పింక్' సినిమా పంపిస్తాను. అది ఉన్న తప్పకుండా చూడాలి' అని రిప్లై ఇచ్చింది. దీంతో నిధి అగర్వాల్‌కు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందుకోసం ఆమె రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకుందని ప్రచారం జరుగుతోంది. రొమాంటిక్ లవ్ బ్యాగ్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











