లాక్ డౌన్‌లో కష్టమైన రోజు.. నిధి అగర్వాల్ కామెంట్స్
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టింది. సవ్యసాచి సినిమాతో పరిచయమైనా, మిస్టర్ మజ్ను సినిమాతో విజయం కోసం ట్రై చేసినా దక్కలేదు. చివరగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి విజయాన్ని చవి చూసింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టినా ఆఫర్లు మాత్రం అంతగా వరించలేదు.
ప్రస్తుతం దేశమంతా కరోనా వైరస్ అంటూ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 14వరకు దేశమొత్తం లాక్ డౌన్ విధించారు. సామాన్య జనం నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అందరూ ఇంటి పట్టునే ఉండాలనే ప్రభుత్వ ఆదేశాలను సక్రమంగా పాటిస్తున్నారు. కొందరు తమకు తామే స్వీయ నిర్భందాన్ని కూడా విధించుకున్నారు.

తారలు ఇంట్లోనే ఉంటూ విలువైన సయమాన్ని తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటే.. మరికొందరు వ్యాయామం, పెయింటింగ్, డ్రాయింగ్ అంటూ తమలోని ప్రతిభను బయట పెడుతున్నారు. తాజాగా నిధి అగర్వాల్.. ఆర్టిస్ట్‌గా మారి వేసిన ఆర్ట్‌ను పోస్ట్ చేసింది. లాక్ డౌన్ సమయంలో ఇదో క్లిష్టమైన రోజంటూ డల్‌గా కూర్చుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications