నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొంత మంది హీరోయిన్లు ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరు. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా చేతి నిండా ఆఫర్లతో బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ నిధి అగర్వాల్ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ హాట్ హీరోయిన్ ఓ స్టన్నింగ్ వీడియోను షేర్ చేసింది. అది మీకోసమే!

మన అమ్మాయే.. అలా ప్రవేశించి

మన అమ్మాయే.. అలా ప్రవేశించి

హైదరాబాద్‌కు చెందిన నిధి అగర్వాల్ ఇక్కడి మార్వాడి కుటుంబంలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా నగరంలోనే సాగింది. అనంతరం ఆమె కుటుంబం కర్నాటకకు వలస వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అలా ఫేమస్ అయిన తర్వాత 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమా ద్వారా పరిచయమైంది.

టాలీవుడ్‌లోకి.. వరుస ఫ్లాపులతో

టాలీవుడ్‌లోకి.. వరుస ఫ్లాపులతో

హీరోయిన్‌గా మారిన తర్వాత నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. అయితే, ఈ బ్యూటీ మాత్రం తన అందం, అభినయంతో మెప్పించింది. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' అనే సినిమా చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో ఆమెకు వరుస షాక్‌లు తగిలాయి.

ఇస్మార్ట్ హిట్.. అలా పెద్ద దెబ్బ

ఇస్మార్ట్ హిట్.. అలా పెద్ద దెబ్బ

వరుస పెట్టి సినిమాలు చేస్తోన్నా తెలుగులో నిధి అగర్వాల్‌కు మాత్రం ఆరంభంలో పెద్దగా హిట్లు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఈ బ్యూటీకి మొట్టమొదటి సక్సెస్ వచ్చి చేరింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్‌కు 'హీరో' మూవీ రూపంలో మరో షాక్ తగిలింది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.

పవన్ మూవీ.. వాటిలోనూ చేస్తూ

పవన్ మూవీ.. వాటిలోనూ చేస్తూ

ఫలితాలతో సంబంధం లేకుండా నిధి అగర్వాల్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో ఆమె కీలక పాత్రను చేస్తోంది. అలాగే, దక్షిణాదిలోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇలా ఈ అమ్మడు తన రేంజ్‌ను పెంచుకునే సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా


ఒకవైపు సినిమాలు సినిమాలు, మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్నా.. నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలను చూపిస్తూ హల్చల్

సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోసేది మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ షో చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో నిధి అగర్వాల్ తరచూ వార్తల్లో నిలవడంతో పాటు ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

నిధి అగర్వాల్ వీడియో వైలర్

నిధి అగర్వాల్ వీడియో వైలర్


హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె హాట్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ యమ రెచ్చిపోయింది. అలాగే, ప్రైవేటు ప్లేస్‌లో ఉన్న టాటూనూ చూపిస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు అందరికీ కనువిందు చేస్తోంది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X