పవన్ కోసం ఆ సినిమాలు వదులుకున్నా. నిధి అగర్వాల్ కామెంట్స్

Nidhhi Agerwal: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం, వరుస సినిమా అవకాశాలు అందుకోవడం అంత సులభం కాదు. రోజురోజుకు కొత్త హీరోయిన్లు వస్తున్న ఈ రంగుల ప్రపంచంలో నిలదొక్కొవాలంటే.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత కష్టమైనా.. ఒప్పుకున్న సినిమాలలో నటించాల్సిందే.ఈ సమయంలో మూవీ మేకర్స్ పెట్టిన కండిషన్లకు అంగీకరించాల్సిందే. అలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఎన్నో కండిషన్స్ కు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటో..?

యంగ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌(Nidhhi Agerwal) ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'సవ్యసాచి'(Savyasachi) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత రామ్ పోతినేని ఇస్మార్ శంకర్ (Ram Pothineni), అఖిల్ సరసన నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. నిధి అగర్వాల్ ప్రస్తుతం రెండు బారీ సినిమాల్లో నటిస్తుంది. ఇందులో ఒకటి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్'(Rajasab), ఈ సినిమా మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మిస్తున్నారు.

Nidhhi Agerwal shocking comments on Pawan Kalyan s Hari Hara Veera Mallu conditions

ఆకట్టుకునే అందం, అభిన‌యం ఆమె సొంతం. ఇటీవల యంగ్ హీరోయిన్ మరోవైపు పవర్ స్టార్ హ‌రిహర వీర‌మ‌ల్లు (Harihara veeramallu)సినిమాలో న‌టించే అవకాశం కొట్టేసింది. అయితే.. ఈ రెండు చిత్రాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. మొత్తానికి ఇదే ఏడాది ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. తాజాగా ఈ చిత్రాల గురించి నిధి అగర్వాల్ మీడియాతో పంచుకుంది.

హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అక్కినేని నాగచైతన్య తో నటించిన సవ్యసాచి సినిమాతో హరిహర వీరమల్లు సినిమాలో నటించే అవకాశం వచ్చిందని వెల్లడించింది. వాస్తవానికి ఆ సినిమా తర్వాత తనకు చాలా కాలం సినిమా అవకాశాలు రాలేక చాలా ఇబ్బంది పడింది. కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ వచ్చిందట. అయితే ఈ సినిమా పూర్తి అయ్యేంతవరకు మరో సినిమాలో నటించకూడదంటూ మూవీ మేకర్స్ కండిషన్స్ పెట్టారంట. ఆ కండిషన్ వల్ల తాను ఎన్నో సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని, పైగా హరి హర వీర సినిమా పలుమార్లు వాయిదా పడుతుండడంతో వేరే సినిమాలను ఒప్పుకోలేకపోయానని వెల్లడించింది.

ఆ సమయంలోనే ప్రభాస్ రాజా సార్ అవకాశం వచ్చిందని, ఆ సినిమాను వదులుకోలేక తాను హరిహర వీరమల్లు మూవీ డైరెక్టర్ కి ఆ విషయాన్ని వెల్లడించాలని చెప్పింది ఇది అగర్వాల్. దీంతో మూవీ మేకర్స్ కూడా ఓకే చెప్పడంతో తాను ప్రభాస్ రాజా సాబ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని వెల్లడించారు. అయితే ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అది కూడా హర్రర్ మూవీలో నటించడం అంటే తనకు కాస్త భయమేస్తుందని, వాస్తవానికి తాను హర్రర్ మూవీస్ ను ఇప్పటివరకు ఒంటరిగా చూడలేదని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. తనలాగా హర్రర్ మూవీస్ అంటే భయపడేవారు తమ ఫ్యామిలీతో కచ్చితంగా రాజస్థాన్ సినిమాను చూడమని సలహానిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం కోసం తాను ఎన్నో అవకాశాలు వదులుకున్నారంటూ హీరోయిన్ నిధి అగర్వాల్ షాపింగ్ కామెంట్స్ చేసింది. తనకు మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన సఖి మూవీ అంటే చాలా ఇష్టమని, అందులో మాధవన్, శాలిని మధ్య కెమిస్ట్రీ తనకు చాలా బాగా నచ్చుతుందని ఆ సినిమాను లెక్కలేనన్నిసార్లు చూశానని చెప్పుకొచ్చింది హీరోయిన్ శ్రీనిధి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X