హీరోయిన్లకు ఆ పని కామన్.. ఆ స్టార్ హీరోతో డేటింగ్‌పై తేల్చేసిన నిధి అగర్వాల్

ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు అన్నాక ఆకర్షణలు సహజం. భారతీయ చిత్ర పరిశ్రమ సంగతి చూసుకుంటే ఎందరో నటీనటుల మధ్య ఎఫైర్లు, చీకటి బంధాలు, ప్రేమలు, పెళ్లిళ్లు చోటు చేసుకున్నాయి. ప్రతి తరంలోనూ ఈ ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో జరిగే పరిణామాలను ఆసక్తిగా గమనించే మీడియా వర్గాలు ఇలాంటి వాటిపై విస్త్రృతంగా వార్తలను వ్యాప్తి చేస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్- శ్రీలీలలు రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే సౌత్‌లోనూ ఓ హిట్ పెయిర్‌పై ఇలాంటి పుకార్లే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై హాట్ కామెంట్స్ చేసింది సదరు హీరోయిన్. ఈ వివరాల్లోకి వెళితే..

బ్రేక్ కోసం నిరీక్షణ

అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ సరైన బ్రేక్ అందుకోలేకపోతున్నారు నిధి అగర్వాల్. పదేళ్లుగా స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ ముద్దుగుమ్మ. 17 ఆగస్ట్ 1992న హైదరాబాద్‌లో ఓ మార్వాడీ కుటుంబంలో జన్మించారు నిధి అగర్వాల్. 2017లో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్‌తో చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచితో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది నిధి అగర్వాల్.. అనంతరం మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో చిత్రాలలో నటించారు.

Nidhhi Agerwal- Simbu Dating hari hara veera mallu Actress Reacted on Rumours About her relation with Silambarasan

ప్రభాస్, పవన్‌లతో ఒకేసారి రొమాన్స్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌లో ఆయనకు జోడిగా నటించారు నిధి అగర్వాల్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నిధి బ్రేక్ అందుకుంది. ముద్దుగా, బొద్దుగా ఉండే నిధి అగర్వాల్‌కు కోలీవుడ్‌లోనూ అవకాశాలు క్యూకట్టాయి. ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ తదితర చిత్రాలతో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాంటి దశలో ఆమెకు ఊహించని అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. అదే హరిహర వీరమల్లు. ఈ షాక్ నుంచి తేరుకునేలోగా మరో అగ్రనటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ది రాజా సాబ్‌లోనూ హీరోయిన్‌గా ఎంపికైంది నిధి.

శింబుతో నిధి అగర్వాల్ డేటింగ్?

తన కెరీర్‌లోనే తొలిసారిగా ఇద్దరు సూపర్‌స్టార్లతో నటిస్తుండటంతో నిధి అగర్వాల్ గాల్లో తేలుతోంది. అయితే నిధి వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో బాగానే వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు, టీమండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో నిధి రిలేషన్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీరిలో శింబుతో పీకల్లోతు ప్రేమలో ఉండటమే కాకుండా ఏకంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇటీవల శింబు తండ్రి, సీనియర్ నటుడు టీ.రాజేందర్ తమ కొడుకు ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడని చెప్పడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. కానీ నిధి అగర్వాల్ - శింబులు ఎప్పుడూ వీటిని ఖండించడం కానీ, తమ బంధాన్ని బయటపెట్టడం కానీ చేయలేదు.

Take a Poll

జనాలకు ఎప్పుడూ అదే యావ

తాజాగా హరిహర వీరమల్లు ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిధి అగర్వాల్‌ను విలేకరులు శింబుతో డేటింగ్ గురించి ఆమెను ప్రశ్నించడంతో ఈ ముద్దుగుమ్మ స్పందించింది. హీరో హీరోయిన్ల గురించి ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయని, వారి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికీ ఆసక్తి అని నిధి అన్నారు. హీరో హీరోయిన్ల గురించి నోటికి ఏది అనిపిస్తే అది అనేస్తారని, ఇదంతా కామన్ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలకు వాస్తవాల కంటే రూమర్స్‌పైనే ఆసక్తి ఎక్కువ, ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని నిధి అగర్వాల్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X