నన్ను తొక్కేయాలని ఇండస్ట్రీలో భారీ కుట్ర... నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

తన కెరీర్‌లోనే ఇద్దరు సూపర్‌స్టార్స్‌తో నటించడంతో నిధి అగర్వాల్ మంచి జోష్‌లో ఉన్నారు. గతేడాది హరిహర వీరమల్లు సినిమాతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన నిధి అగర్వాల్... ఈ సంక్రాంతికి పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ సరసన ఆడిపాడారు. ఈ రెండు సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. తన కెరీర్‌కు మాత్రం ఢోకా లేదని అంటున్నారు నిధి. అయితే ఇటీవల పలు కాంట్రవర్సీలలోనూ నిధి అగర్వాల్ పేరు వినిపించడంతో పాటు పలు చేదు అనుభవాలు సైతం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్‌లో పాల్గొన్న నిధి అగర్వాల్ తన కెరీర్, తనపై ఇండస్ట్రీలో జరుగుతున్న కుట్రల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు నిధి అగర్వాల్. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో తదితర చిత్రాలలో నటించారు. వీటిలో ఇస్మార్ట్ శంకర్‌తో తొలి బ్రేక్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో తమిళంలోనూ అదృష్టం పరీక్షించుకున్నారు. ఆ సమయంలో తమిళ హీరో శింబుతో ప్రేమాయణం వరకు వెళ్లినట్లు , ఇద్దరూ కలిసి సహజీవనం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తర్వాత ఇవేవీ నిజం కాదని.. ఆమె క్లారిటీ ఇచ్చారు.

Nidhhi Agerwal Slams Negative Campaigns Defends Kartik Aaryan and Varun Dhawan

ఈ దశలో పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో అవకాశం అందుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం, ఇతర కారణాలతో వీరమల్లు ఆలస్యం అయ్యింది. తర్వాత పవన్ ఎంతో శ్రమించి ఈ సినిమాను పూర్తి చేశారు. ఆ సమయంలో సినిమా ప్రమోషన్ మొత్తాన్ని నిధి అగర్వాల్ తన భుజాలపై మోసి స్వయంగా పవన్ కళ్యాణ్ చేత ప్రశంసలు పొందారు. ఈ సినిమా విడుదలైన కొద్దినెలల తర్వాత ప్రభాస్‌తో నటించిన ది రాజా సాబ్ మూవీ విడుదలైంది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ నిధి అగర్వాల్ అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ది రాజాసాబ్ మూవీ ప్రమోషన్ సమయంలో హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆమెను అభిమానులు చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. భద్రతా సిబ్బంది ఎంతో శ్రమించి నిధి అగర్వాల్‌ను క్షేమంగా పంపించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం నేపథ్యంలో హీరో శివాజీ కామెంట్స్, దీనికి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్‌లు జరిగాయి. హీరోయిన్లు మంచి డ్రెస్‌లు వేసుకుంటే ఇలాంటి పరిస్ధితి కాదన్న సీనియర్ నటుడి వ్యాఖ్యలను నిధి ఖండించారు. బాధితురాలిదే తప్పని నిందించడం మానిపులేషన్ అవుతుందని పోస్ట్ పెట్టారు నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె పలు కథా చర్చల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్.

ఇదిలాఉండగా.. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నిధి అగర్వాల్‌ను ఇండస్ట్రీలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ గురించి... అలాగే బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్‌లపై జరిగిన దుష్ప్రచారాన్ని యాంకర్ ప్రశ్నించాడు. దీనికి ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటివి జరగడం చాలా దారుణం. ఇందుకోసం కొందరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నటీనటులు చాలా సెన్సిటివ్, ఎమోషనల్, చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారు. ఇలాంటివి జరిగితే వారి కుటుంబాలు కూడా ఎంతో బాధపడతాయి. మేం సమాధానం చెప్పాల్సింది మా తల్లిదండ్రులకు మాత్రమే. ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్‌లు మంచిది కాదని నిధి అన్నారు.

కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్‌లు చాలా మంచివారు, జెన్యూన్. వరుణ్ చాలా స్వీట్ తనది చిన్నపిల్లల మనస్తత్వం. కో స్టార్స్‌ను వరుణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు. కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ కాదు. నాపైనా ఒకటి రెండు నెగిటివ్ క్యాంపెయిన్‌లు జరిగాయి. కానీ వాటిని నేను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాను. కాశీకి వెళ్లొచ్చిన తర్వాత నా జీవితం చాలా మారిపోయింది. దేవుడు, ఆధ్యాత్మికతో నాకు కనెక్ట్ అయ్యింది. ఇలాంటి పరిస్ధితులు నాకు ఎదురైతే నేను ఎదుర్కొంటాను అని నిధి అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిధి అగర్వాల్‌పై నెగిటివ్ క్యాంపెయిన్ చేసింది ఎవరు? అనేదానిపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X