తెలుగు సినిమాకు 'పవన్ కళ్యాణ్' ఒక గిఫ్ట్.. హాట్ హీరోయిన్ ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని ఇండియన్ యాక్టర్ ఉండడు. బాషాభేదం లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునే పవర్ స్టార్ గురించి తోటి నటీనటులకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక నేటితరం హీరోలు చాలా వరకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టపడతారు. కుర్ర హీరోల్లో కొందరు ఆయనకి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయం స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 ఫ్యాన్స్ తో హాట్ బ్యూటీ చిట్ చాట్..

ఫ్యాన్స్ తో హాట్ బ్యూటీ చిట్ చాట్..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి అడుగులు వేస్తున్న నిధి అగర్వాల్ ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కెరీర్ మొదట్లో కాస్త అపజయాలు ఎదుర్కొంది. ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక ట్రాక్ లోకి వచ్చిన అమ్మడు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ అందుకుంది.

 పవర్ స్టార్ ఒక గిఫ్ట్..

పవర్ స్టార్ ఒక గిఫ్ట్..

ఇక ఆమె ఫాలోవర్స్ అడిగిన వందల ప్రశ్నల్లో బెస్ట్ ట్వీట్స్ ని సెలెక్ట్ చేసుకొని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటిలానే మా పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా చెప్పండి అంటూ ట్వీట్స్ చేశారు. అందుకు ఒక్క మాటతోనే నిధి పవన్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక మంచి గిఫ్ట్.. అని చెప్పింది. ఆ కామెంట్ కి ఫ్యాన్స్ నిధి అగర్వాల్ కి ఫిదా అయిపోయారు.

దానికి ఇంకా టైముంది..

దానికి ఇంకా టైముంది..

అలాగే నిధి పర్సనల్ లైఫ్ గురించి ఫాలోవర్స్ అనేక ప్రశ్నలు అడిగారు. పెళ్లి గురించి ప్రస్తావన రాగా.. దానికి ఇంకా చాలా టైముంది అంటూ..ప్రస్తుతం తన గోల్ మంచి సినిమాలు చేయడమే అని వివరణ ఇచ్చింది. అలాగే తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా వాటిని లెక్క చేయనని చెబుతూ.. నటిగా బిజీ అవ్వడమే తనకు ఎక్కువా సంతోషాన్ని కలిగించే విషయమని తెలిపింది.

Recommended Video

Nidhi Agarwal Purchased Grand New Porsche Macan
మూడు సినిమాలతో బిజీ..

మూడు సినిమాలతో బిజీ..

ప్రస్తుతం నిధి అగర్వాల్ అశోక్ గల్లా మొదటి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది. కన్నడ , తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఆ రెండు సినిమాల్లో నిధి అగర్వాల్ చాలా డిఫరెంట్ గా కనిపించనుందట. ఇస్మార్ట్ శంకర్ హిట్టు తరువాత వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ ఈ హాట్ బ్యూటీ ఒప్పుకోవడం లేదు. కేవలం తనకు సెట్టయ్యే పాత్రలనే ఎంచుకోవాలని జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X