కోవిడ్ బాధితుల కోసం హీరోయిన్ నిధి అగర్వాల్ సరికొత్త ప్లాన్!
కరోనా ధాటికి ఎంతో మంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగానే కాకుండా ఆకలి కేకలు కూడా చాలానే వినిపిస్తున్నాయి. ఓ వైపు మరణాలు మరోవైపు సమస్యలతో పెదవాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉండడం కొందరిని కలచివేస్తోంది. ఇక ఆరోగ్య పరమైన సహాయలతో పాటు మరికొందరు నిత్యావసర వస్తువులను అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అలాంటి సెలబ్రేటీల బాటలో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ కూడా చేరింది. నిధి అగర్వాల్ స్టార్ హీరోయిన్ గానే కాకుండా సహాయం చేయగలిగే మంచి అమ్మాయి కూడా. ఇక ఆమె కోవిడ్ కష్టకాలంలో బాధితుల కోసం తన శక్తిమేర సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఆమె ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు. Distributelove. org అనే ఒక వెబ్ సైట్ ను స్థాపించి అందులో వివరాలు ఇవ్వాలని కోరారు.

వీలైనంత వరకు తమవంతు సహాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని నిధి అగర్వాల్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఇక రామ్ తో ఇస్మార్ట్ శంకర్ హిట్టుతో మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ భాషతో సంబందం లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి ఛాన్సులు అందుకుంటోంది. ప్రస్తుతం మహేష్ మేనల్లుడు అశోక గల్లా నటిస్తున్న మొదటి సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ సినిమాతో హిట్టు కొడితే అమ్మడి కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడం కాయం


Click it and Unblock the Notifications