మళ్లీ జన్మంటూ ఉంటే నిధి అగర్వాల్‌గా పుట్టాలి.. చూస్తే హిస్టిరియానే: బ్యూటీపై టాప్ డైరెక్టర్లు ఫిదా
అందం, అభినయం కలిసి ఉన్న హీరోయిన్లలో యువ తార నిధి అగర్వాల్ ఒకరంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. గతంలో ఆమె నటించిన చిత్రాల మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి హీరోయిన్‌గా మరో లెవెల్‌కు వెళ్లిపోయింది. అయితే కరోనావైరస్ కారణంగా తెలుగు ప్రేక్షకులకు కాస్త దూరమైన నిధి అగర్వాల్ తాజాగా హీరో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నిధి అగర్వాల్‌పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ..

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు
నిధి అగర్వాల్ తన సినీ రంగ ప్రవేశం హిందీ చిత్రంతో చేసింది. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్‌తో స్టార్ హీరోయిన్‌గా ప్రశంసలు అందుకొన్నది. తాజాగా హీరో అనే చిత్రంలో గల్లా అశోక్‌తో కలిసి నటించింది.

నిధిపై అనిల్ రావిపూడి, కొరటాల శివ
తెలుగు సినిమా పరిశ్రమకు పరిచమవుతూ అశోక్ గల్లా నటించిన హీరో చిత్రంలో నిధి అగర్వాల్ గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. కేవలం అందాల ఆరబోతతోనే కాకుండా నటనతో కూడా మెప్పించింది. థియేటర్లలో నిధి గ్లామర్ ట్రీట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా సక్సెస్, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో నిధి అగర్వాల్‌పై సినీ ప్రముఖులు, దర్శకులు అనిల్ రావిపూడి, కొరటాల శివ కురిపించిన ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిధిపై జగపతిబాబు హాట్ కామెంట్స్
హీరో ప్రమోషనల్, సక్సెస్ మీట్, థ్యాంక్యూ మీట్‌లో నిధి అగర్వాల్ గురించి అనిల్ రావిపూడి, కొరటాల శివ, నటుడు జగపతిబాబు, బ్రహ్మాజీ, వీకే నరేష్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. హీరో థ్యాంక్యూ ఈవెంట్‌లో జగపతి మాట్లాడుతూ.. నాకు మళ్లీ హీరోగా నటించాలనే కోరిక కలుగుతున్నది. ఎందుకంటే హీరోయిన్‌గా నిధి అగర్వాల్ పక్కన నటించే అవకాశం దక్కొచ్చు. ఈ సినిమాలో ఆమెకు వచ్చిన రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నాను అని జగపతి అన్నారు. బ్రహ్మజీ మాట్లాడుతూ.. నిధి అంటే సంపద.. ఆమె నటించిన సినిమాలు మంచి కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి అని అన్నారు.

చూడగానే హిస్టీరియా అంటూ
హీరో థ్యాంక్యూ మీట్‌లో నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ.. హీరో సినిమా థియేటర్లలో చూస్తుంటే.. నిధి అగర్వాల్ కనపడగానే ప్రేక్షకుల్లో హిస్టీరియా వచ్చింది. అలాంటి రెస్సాన్స్ చూసిన తర్వాత నేను మనస్పూర్తిగా కోరుకొన్న విషయం ఏమిటంటే.. నాకు మరో జన్మ కనుక ఉంటే.. నేను నిధి అగర్వాల్‌గా పుట్టాలని కోరుకొంటున్నాను. ఆమెకు అంత క్రేజ్ ఉంది అని నరేష్ అనడంతో నిధి అగర్వాల్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయింది.

పవన్ కల్యాణ్‌తో హరిహర వీరమల్లులో
ఇక నిధి అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ నటుడు శింబుతో కలిసి ఈశ్వరన్ చిత్రంలో నటించిన నిధి తమిళంలోకి కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత భూమి చిత్రంలో, అలాగే మరో తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











