Nidhhi Agerwal: మళ్ళీ ఎద అందాలతో కళ్ళు చేదిరేలా చేసిన నిధి అగర్వాల్.. ఫోకస్ అక్కడ పడేలా..

నిధి అగర్వాల్ నటిగా మోడల్ గా డ్యాన్సర్ గా మంచి గుర్తింపు అందుకుంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఇష్టం పెంచుకున్న నిధి ఆ తరువాత మోడల్ గా మారి పలు కమర్షియల్ యాడ్స్ లలో కూడా మెరిసింది. ఇక ప్రస్తుతం తనదైన శైలిలో నటిగా మంచి సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇక ఈ బ్యూటీ అప్పుడప్పుడు గ్లామరస్ ఫొటోలతో కూడా ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక రీసెంట్ గా అమ్మడు మరోసారి స్టన్ అయ్యేలా గ్లామర్ తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

 యాక్టింగ్ పై ఫోకస్

యాక్టింగ్ పై ఫోకస్

నిధి అగర్వాల్ 2017లో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలై పెట్టింది. ఆమె బెంగుళూరులో జన్మించింది. అమ్మడు చిన్నప్పుడు స్టేజ్ షోలతో డ్యాన్స్ డ్రామాలు చేస్తూ యాక్టింగ్ పై ఫోకస్ చేసింది. చదువు పూర్తయ్యాక సినిమా నటి కావాలనే తన కలను కొనసాగించేందుకు నిధి ముంబైకి వెళ్లింది. మొదట్లో మోడల్ గా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ముందు అనేక బ్రాండ్ కమర్షియల్ యాడ్స్ లలో కనిపించింది.

 బాలీవుడ్ సినిమాతో

బాలీవుడ్ సినిమాతో

ఇక 2017లో నిధి బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్‌తో కలిసి "మున్నా మైఖేల్" చిత్రంతో అడుగుపెట్టింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ నిధి నటన గ్లామర్ ప్రేక్షకులు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె అరంగేట్రం తరువాత సినిమాలలో వెబ్ సిరీస్‌లలో అనేక ఆఫర్స్ వచ్చాయి.

టాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్ ఎంట్రీ

ఇక 2018 లో నిధి తెలుగులో నాగ చైతన్య సరసన "సవ్యసాచి" చిత్రంలో నటించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. అయినా కూడా నిధి గ్లామర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2019 లో నిధి బాలీవుడ్ చిత్రం "బాట్లా హౌస్" లో జాన్ అబ్రహం సరసన నటించింది. ఈ చిత్రం మాత్రం అమ్మడి రేంజ్ ను ఇంకాస్త పెంచింది.

రామ్ తో బిగ్ హిట్

రామ్ తో బిగ్ హిట్

2020 లో నిధి తెలుగులో రామ్ పోతినేని సరసన "ఇస్మార్ట్ శంకర్" చిత్రంలో నటించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిధి తన నటనకు చాలా ప్రశంసలు అందుకుంది. అందులో ఆమె న్యూరో సైంటిస్ట్ పాత్రలో ఆమె నటించింది. ఇక ఆ తరువాత అమ్మడికి ఆఫర్స్ సంఖ్య పెరగడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఎద అందాలతో షాక్

ఎద అందాలతో షాక్

ఇక నిధి అగర్వాల్ కు ఆఫర్లు ఎన్ని వస్తున్నా కూడా ఆమె గ్లామర్ విషయంలో కూడా మరింతగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోషూట్స్ తో తన ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటుంది. ఇక రీసెంట్ గా అమ్మడు డిఫరెంట్ డ్రెస్ లో తన ఎద అందాలను మరింత ఘాటుగా ప్రజెంట్ చేసింది. గతంలో ఇంతకంటే ఘాటుగా కనిపించినప్పటికీ ఈ లుక్ లో మాత్రం నిధి అగర్వాల్ చాలా అందంగా ఉంది అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా

పవన్ కళ్యాణ్ సినిమా


ఇక నిధి అగర్వాల్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా ప్రధాన కథానాయకగా నటిస్తోంది. అలాగే ఒక బాలీవుడ్ సినిమాలో కూడా నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X