ఆ హీరోతో అఫైర్ గురించి మాట్లాడితే.. వాకౌట్ చేస్తా.. మీడియాకు నిధి అగర్వాల్ షాక్ అంటూ వార్తలు వైరల్
సినీ పరిశ్రమలో ప్రేమ, డేటింగ్ ఆ తర్వాత వివాహాలు చాలా కామన్. అయితే ఇటీవల కాలంలో తమిళ హీరో శింబుతో నిధి అగర్వాల్ డేటింగ్ చేస్తుందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయం మీద అడిగిన మీడియా ప్రతినిధులకు నిధి అగర్వాల్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

జాక్పాట్ కొట్టి
నిధి అగర్వాల్ అనే పేరుకి తెలుగులో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పటికీ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలు ఈ భామ చేసింది కానీ ఒక్క సినిమా కూడా ఈ భామకు మంచి పేరు అయితే తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతానికి ఈ భామ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కించుకుని జాక్పాట్ కొట్టింది.

హీరో అనే సినిమా త్వ
ఈ భామ హీరోయిన్ గా నటించిన హీరో అనే సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల అవుతోంది. గల్లా జయదేవ్- పద్మావతిల కుమారుడు అశోక్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మహేష్ బాబు మేనల్లుడు కావడంతో ఈ సినిమాను గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అదీకాక గల్లా జయదేవ్ భార్య పద్మావతి స్వయంగా అమర్ రాజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించి తన సొంత డబ్బుతో తన కుమారుడిని హీరోగా లాంచ్ చేస్తున్నారు.

శింబుతో ప్రేమలో
ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిధి అగర్వాల్ హైదరాబాద్ లో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అనేక ప్రమోషనల్ కార్యక్రమాలు హైదరాబాద్ లో జోరుగా సాగుతున్నాయి. అయితే హీరోయిన్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో నిధి అగర్వాల్ కూడా పాల్గొనవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి దక్షిణాది మీడియాలో నిధి అగర్వాల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమె ఇప్పటికే చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న శింబుతో ప్రేమలో పడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.

పెద్ద ఎత్తున చర్చలు
శింబు హీరోగా తెరకెక్కిన ఈశ్వరమ్ అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఏకంగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కేవలం తెలుగు మీడియా అనే కాదు అన్ని బాషల మీడియాలో మొత్తం మీద ఈ వ్యవహారం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నేను వెళ్ళిపోతా
అయితే తాజాగా జరుగుతున్న ప్రమోషన్స్ విషయంలో శింబుతో మీరు డేటింగ్లో ఉన్నారన్నది వార్త నిజమేనా అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన దానికి నిధి అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. "నేను వివాదాల మూడ్‌లో లేను. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. ఎవరైనా దాని గురించి అడిగిన వెంటనే నేను వెళ్ళిపోతాను, "అని నిధి చెప్పిందట. ఈ ప్రశ్న అడగవద్దని మేకర్స్ మీడియా సిబ్బందిని వేడుకున్నారని తెలుస్తోంది.

శింబు ఎలా స్పందిస్తారో
శింబుతో అఫైర్ గురించి స్పందించడానికి నిరాకరించింది అంటే.. ఆ హీరోతో డేటింగ్ చేస్తున్నాదా? లేదా అనే విషయంపై బలంగా చర్చ జరుగుతున్నది. నిప్పు లేనిదే పొగ రాదని అంటూ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇక ముందు ఈ డేటింగ్ వ్యవహారంపై శింబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











