పవన్ కళ్యాణ్‌- ప్రభాస్ మల్టీస్టారర్‌.. రాజా సాబ్ బ్యూటీ ఊహ ఎంత బాగుందో..

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేయడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్‌గా మారింది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్‌తో 'హరి హర వీరమల్లు' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి, ఇప్పుడు సంక్రాంతికి ప్రభాస్‌తో 'ది రాజా సాబ్' సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి 'హరి హర వీరమల్లు' పై భారీ అంచనాల పెట్టుకున్న నిధి.. మూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ రాజాసాబ్ పై ఆశలు పెట్టుకుంది.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్' చిత్రం హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోంది. ఈ మూవీలో నిధి అగర్వాల్ 'బెస్సీ' అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఆమెతో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో వరుసగా ప్రమోషన్స్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ పెంచుతున్నారు.

Nidhhi Agerwal s Dream Multistarrer With Pawan Kalyan and Prabhas Sparks Buzz

తాజాగా ప్రమోషన్లలో భాగంగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. '#AskNidhhi' పేరుతో ఎక్స్ (ట్విట్టర్)లో అభిమానులతో ముచ్చటించింది. ఈ చిట్‌చాట్‌లో ఆమె ఇచ్చిన కొన్ని సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న "తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏది?" అన్న దానికి నిధి ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.

ఆ ప్రశ్నకు నిధి రిప్లై ఇస్తూ.. ప్రభాస్ - పవన్ కళ్యాణ్ హీరోలుగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అయితే, హీరోయిన్‌గా తాను ఉంటే బాగుంటుందని ట్వీట్ చేసింది. ఈ కాంబినేషన్ వింటేనే ఫ్యాన్స్‌లో ఊహలు పరుగులు పెట్టడం సహజం. అయితే వాస్తవంగా ఈ కాంబో సెట్ కావడం సాధ్యమయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే.. ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలతోనూ టైట్ షెడ్యూల్‌లో ఉన్నారు. అయినప్పటికీ, నిధి చెప్పిన ఈ డ్రీమ్ కాంబినేషన్ నెట్టింట భారీ చర్చకు దారి తీసింది.

అంతేకాదు.. ప్రభాస్ సినిమాల్లో తనకు 'సలార్' అంటే చాలా ఇష్టమని నిధి చెప్పింది. ప్రభాస్‌ను 'ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అంటూ ప్రశంసించింది. అలాగే పవన్, ప్రభాస్ ఇద్దరూ తమ అభిమానులను అమితంగా ప్రేమించే స్టార్స్ అని పేర్కొంది. ఈ కామెంట్స్ ఫ్యాన్స్‌ను మరింత ఆకట్టుకున్నాయి.

ఇక నిధి కెరీర్ విషయానికి వస్తే... 'హరి హర వీరమల్లు' ఫలితం నిరాశపరిచినా, ఆమె ఆశలన్నీ ఇప్పుడు 'రాజా సాబ్' మీదే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే నిధి మరోసారి తన గ్లామర్‌తో పాటు నటనతో సత్తా చాటే అవకాశం ఉంది. ప్రభాస్ సరసన పర్ఫెక్ట్ జోడీగా ఆమె కనిపిస్తుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నిధి అగర్వాల్ కూడా 'రాజా సాబ్'తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయాలనే ధీమాతో ఉంది. ఒకవైపు ప్రభాస్ సినిమా హైప్, మరోవైపు పవన్-ప్రభాస్ మల్టీస్టారర్ కలలు... ఇవన్నీ నిధిని మరోసారి వార్తల్లో నిలిపాయి. మరి 'రాజా సాబ్' ఆమె కెరీర్‌కు ఎంతవరకు టర్నింగ్ పాయింట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X