పవన్ కల్యాణ్ ప్రధాని అయినా ఆశ్చర్యపోవద్దు.. యంగ్ హీరోయిన్ జోస్యం!
ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఉన్న స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే థియేటర్ల వద్ద అభిమానుల సందడి పీక్స్‌లో ఉంటుంది. అదే సమయంలో సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గళం విప్పుతూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. తనదైన స్టైల్ లో పాలనను కొనసాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్‌పై యంగ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఇంతకీ ఏమన్నారు?
ఆ బ్యూటీ ఎవరో కాదు. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో వంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ తో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు రాకపోవడంతో తమిళ సినిమాల్లోనూ అవకాశాలు వెతికారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమాయణం, సహజీవనం అంటూ వార్తలు వచ్చినప్పటికీ, అవన్నీ వదంతులేనని నిధి స్పష్టత ఇచ్చారు.

ఈ దశలో పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రావడం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం, ఇతర కారణాలతో ఈ సినిమా ఆలస్యం అయినా, చివరికి ఆయన ఎంతో శ్రమించి షూటింగ్ పూర్తి చేశారు. సినిమా ప్రమోషన్ల సమయంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో, మొత్తం ప్రచార బాధ్యతను నిధి అగర్వాల్ భుజాలపై వేసుకుని నిర్వర్తించారు. దీనికి గాను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆమెను ప్రశంసించడమూ అప్పట్లో చర్చనీయాంశమైంది.
హరిహర వీరమల్లు తర్వాత నిధి అగర్వాల్, ప్రభాస్ సరసన నటించిన ది రాజా సాబ్ సినిమా విడుదలైంది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయినప్పటికీ నిధి అగర్వాల్ అందం, నటనకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ,'పవన్ కళ్యాణ్ సింహంలాంటి వ్యక్తి. ఆయన ఒంటరిగా నిలబడి పోరాడే ధైర్యం ఉన్న నాయకుడు. ప్రజల కోసం, తన సిద్ధాంతాల కోసం రాజీ పడకుండా నిలబడతారు. అలాంటి వ్యక్తిత్వం చాలా అరుదు' అని అన్నారు.
అంతేకాదు, 'భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని అయితే నాకు ఎలాంటి ఆశ్చర్యం ఉండదు. రాష్ట్ర రాజకీయాలకే కాదు, జాతీయ స్థాయిలోనూ ప్రభావం చూపగల సామర్థ్యం ఆయనకు ఉంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. పవన్ కళ్యాణ్ రాజకీయ విజయం గురించి ప్రశ్నించగా, 'ఇప్పుడే గెలిచారు కాబట్టి వెలుగులోకి వచ్చారు అనుకుంటారు. కానీ ఆయన చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్నారు'అని నిధి వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. నిజంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఎటువైపు సాగుతుంది? నిధి అగర్వాల్ చెప్పిన జోస్యం నిజమవుతాయా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











