అందాల ‘నిధి’.. వాటిని హైలెట్ చేస్తూ హీటెక్కిస్తున్న భామ
నిధి అగర్వాల్.. అందమున్నా అదృష్టం కలిసి రాలేదు. మొదటి రెండు సినిమాలు అక్కినేని హీరోలతో చేసినా.. లక్ కలిసి రాక హిట్టు కొట్టలేకపోయింది. అయినా సరే సినిమా అవకాశాలు మాత్రం రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు కొట్టి ఇస్మార్ట్ బ్యూటీగా ఫేమస్ అయింది ఈ భామ.
ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన బూస్ట్‌తో నిధి యమ జోరుగా సాగిపోతోంది. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన పోస్ట్‌లు పెడుతూ.. హల్ చల్ చేస్తోంది. తాజాగా జరిగిన సైమా వేడుకల్లో ఇస్మార్ట్ పాటకు డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఎనర్జిటిక్ రామ్‌ను మించిపోయేలా వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on InstagramGood morning ✨🌟 #mitrandiyeshai releases tomorrow! @aahomusic @badboyshah
A post shared by Nidhhi Agerwal (hh) (@nidhhiagerwal) on

తాజాగా నిధి పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారు మతిపోగొట్టేలా చేస్తున్నాయి. నిధిలా దాచుకున్న తన అందాలను చూపిస్తూ.. నిధి అగర్వాల్ యూత్‌ను టార్గట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలు లైకులు, షేర్లతో సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ప్రస్తుతం ఇస్మార్ట్ సక్సెస్‌లో ఉన్న నిధి.. మరే సినిమాకు ఓకే చెప్పినట్లు లేదు. మరో సినిమాతో తన అభిమానులను అలరించేందుకు నిధి ఎప్పుడు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











