బెడ్‌పై పడుకుని పోజులు.. అందాల ‘నిధి’హల్చల్
ఇస్మార్ట్ శంకర్‌తో తొలి విజయాన్ని అందుకుంది నిధి అగర్వాల్. అంతకు ముందు చేసిన రెండు సినిమాలు బోల్తా కొట్టినా కూడా అవకాశాలు మాత్రం వచ్చాయి. సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాగా.. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే అఖిల్ మిస్టర్ మజ్నులో అవకాశం వచ్చింది. నిధికి అదృష్టం ఉందని ఇక్కడే అర్థమవుతోంది. ఈ కాలంలో ఒక్క సినిమాలో ఛాన్స్ రావడమే కష్టం అనుకుంటే.. మొదటి చిత్రం పూర్తి కాకముందే రెండో చిత్రంలో అవకాశం రావడం మామూలు విషయం కాదు.
అలాంటి చేసిన రెండు చిత్రాలూ బోల్తొ కొట్టినా మూడో అవకాశం రావడం కేవలం నిధి విషయంలోనూ జరిగినట్టుంది. అయితే కావాల్సినంత అందం ఉండటంతో నిధికి అవకాశలు మాత్రం వస్తూనే ఉన్నాయి. దాంతో ఇస్మార్ట్ శంకర్ రూపంలో అదృష్టం కూడా వచ్చింది. ఈ సినిమాలో అందాలను ఆరబోసి అందర్నీ ఆకట్టుకుంది నిధి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పలు ఆఫర్స్ వచ్చాయి.

అటు వెండితెరపై తన అందాన్ని ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటే.. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. తాజాగా నిధి షేర్ చేసిన ఫోటోను చూస్తే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. నిధి అందాలను చూసి నెటిజన్లు లొట్టలేస్తున్నారు.


Click it and Unblock the Notifications











