ఫోన్‌లో ఉన్న సీక్రెట్ విషయాలన్నీ చెప్పిన నిధి.. చదువుల్లోనూ ఇస్మార్టే.. ఫ్యాన్స్‌తో చిట్ చాట్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది నిధి అగర్వాల్. తెలుగు తెరకు పరిచయమయ్యాక చవిచూసిన మొదటి సక్సెస్ కావడంతో అంతులేని ఆనందంలో మునిగిపోయింది. అయితే మొదటగా చేసిన రెండు చిత్రాలు (సవ్యసాచి, మిస్టర్ మజ్ను) అంతగా వర్కౌట్ కాకపోయినా.. ముచ్చటగా మూడో సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉండగా.. ఇంట్లోనే ఉన్న నిధి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ మేరకు అనేక విషయాలకు వెల్లడించింది. అవేంటో ఓ సారి చూద్దాం.

కరోనా సమయంలో సెగలు..
కరోనా వైరస్‌కు కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించగా అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే నిధి అగర్వాల్ ఇంట్లోనూ ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు నిద్ర పట్టకుండా చేస్తోంది. ఆ మధ్య నిధి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది.

తాజాగా చిట్ చాట్..
తాజాగా నిధి అగర్వాల్ అభిమానులతో చిట్ చాట్ చేసింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా ఆన్సర్స్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె చెప్పిన కొన్ని సమాధానాలతో ఫోన్‌లోని సీక్రెట్స్ బయట పడ్డాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

స్క్రీన్ లాక్, వాట్సప్ డీపి..
నెటిజన్స్ ఎక్కువగా ఫోన్‌లోని సీక్రెట్స్‌కు సంబందించిన విషయాలనే అడిగారు. ఈ మేరకు స్క్రీన్ లాక్ పిక్, వాట్సప్ డీపీ, చివరగా వాడిన యాప్ ఏది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ మాత్రం జంకని నిధి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

చదువుల్లోనూ ఫస్ట్..
నిధి అగర్వాల్ చదువుల్లోనూ ఇస్టార్టేనని తెలుస్తోంది. ఓ నెటిజన్ ఇంటర్‌లో ఎంత పర్సెంటీజీ వచ్చిందని అడగ్గా.. 87 శాతం అని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే అందమే కాదు.. చదువుల్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నట్టుంది.


Click it and Unblock the Notifications











