twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను టార్గెట్ చేస్తున్నారు, కారణం నా ఫ్యామిలీ: నిహారిక

    |

    మెగా డాటర్ నిహారిక సినిమాల్లోకి వచ్చిన తర్వాత అందరు హీరోయిన్ల మాదిరిగానే ఆమెపై కూడా గాసిప్స్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెపై ఎక్కువగా మ్యారేజ్ రూమర్స్ హల్ చల్ చేశాయి. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్ ఇలా పలువురు హీరోలను ఆమె పెళ్లాడబోతోంది అంటూ వేర్వేరు సందర్భాల్లో పుకార్లు షికార్లు చేశాయి.

    తాజాగా 'సూర్యకాంతం' ప్రమోషన్లలో పాల్గొన్న నిహారిక ఈ రూమర్లపై వివరణ ఇచ్చారు. తనపై ఇలాంటి ప్రచారం జరుగడానికి కారణం ఏమిటి? ఆ సమయంలో తాను ఎలా ఫీలయ్యానో వివరించే ప్రయత్నం చేశారు. ఇలాంటివి విన్నప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

    నిజంగా జరిగినా నమ్మరేమో?

    నిజంగా జరిగినా నమ్మరేమో?

    మీడియాలో ఇప్పటికే చాలా సార్లు నా పెళ్లి చేశారు. ఇప్పుడు నిజంగా నా పెళ్లి జరిగినా ఎవరికీ ఇంట్రస్ట్ ఉండదు. ఇదిగో నా తాళి అని చూపిస్తే తప్ప నమ్మే పరిస్థితి ఉండదేమో? అని నిహారిక చమత్కరించారు.

    విజయ్ దేవరకొండను ఒక్కసారి కూడా కలవలేదు

    విజయ్ దేవరకొండను ఒక్కసారి కూడా కలవలేదు

    నిప్పులేనిదే పొగరాదు.. అని అంటుంటారు. కానీ నా విషయంలో ఆ నిప్పు లేకుండానే పొగ వచ్చింది. విజయ్ దేవరకొండను నా జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదు. కానీ మీడియాలో మాకు ఏకంగా పెళ్లి చేసేశారని... నిహారిక తెలిపారు.

    ప్రభాస్ డిగ్రీలో ఉండగా కలిశానంతే..

    ప్రభాస్ డిగ్రీలో ఉండగా కలిశానంతే..

    నాకు ప్రభాస్ గారితో కూడా పెళ్లి చేశారు. ఆ గాసిప్ వచ్చిన సమయంలో నేను నా స్నేహితులతో కలిసి బాలి ట్రిప్ వెళ్లాను. నా పక్కన ఒక ఫ్రెండుకు ఫోన్ చేసి మీరు బాలి ఎందుకు వెళ్లారు? నిహారిక బ్యాచిలర్ ట్రిప్పా? అని అడిగారు. అలా అడగటంతో షాకయ్యాను. ఎందుకు ఇలా అడుగుతున్నారంటే నిహారిక, ప్రభాస్‌కు పెళ్లి అని వార్తలు వస్తున్నాయని చెప్పారు.

    నేను ప్రభాస్‌ను డిగ్రీ చదువుతుండగా మేక్ ఎ విష్ ఫౌండేషన్ కార్యక్రమంలో క్యాన్సర్ పేషెంట్లతో ప్రభాస్ మీట్ ఏర్పాటు చేసినపుడు మాత్రమే కలిసినట్లు నిహారిక తెలిపారు.

    నా ఫ్యామిలీ ఉంది కాబట్టే టార్గెట్

    నా ఫ్యామిలీ ఉంది కాబట్టే టార్గెట్

    వేరే హీరోయిన్ల మీద రూమర్స్ రాస్తే అవి ఆమె వరకే ఉంటాయి. నా మీద రూమర్స్ రాస్తే నా వెనక పెద్ద ఫ్యామిలీ ఉంది కాబట్టి... ఈమె పెళ్లి గురించి చిరంజీవి ఇలా రియాక్ట్ అయ్యారు, పవన్ కళ్యాణ్ రియాక్టర్ అయ్యారు అని రాసుకోవచ్చుకదా, అందుకే నా మీద ఇలాంటి వార్తలు రాస్తున్నారని నా ఫీలింగ్. కాజల్ లాంటి వారిపై రూమర్స్ రాస్తే ఆమె ఫాదర్, మదర్ ఎవరికీ తెలియదు కాబట్టి పెద్దగా వర్కౌట్ కాదు. నా వెనక ఫ్యామిలీ ఉంది కాబట్టే నన్ను సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారని నిహారిక తెలిపారు.

    English summary
    Niharika Denies Marriage rumors with Prabhas. Niharika Konidela is an Indian film actress, dancer and television presenter known for her works in Telugu cinema & Tamil cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X